కరోనా పేషెంట్‌కు రూ.కోట్లలో బిల్లు.. ఎంతో తెలిస్తే గుండె గుబేలు..

అమెరికాలోని సియాటిల్‌లో ఓ కరోనా రోగి కోలుకున్న తర్వాత అతడికి ఆస్పత్రి యాజమాన్యం 1.1 మిలియన్ డాలర్ల బిల్లు వేసింది.

news18-telugu
Updated: June 14, 2020, 2:34 PM IST
కరోనా పేషెంట్‌కు రూ.కోట్లలో బిల్లు.. ఎంతో తెలిస్తే గుండె గుబేలు..
ప్రస్తుతం ట్రయల్స్ దశలో ఉన్న ఈ యాప్‌ను రెండు మూడు రోజుల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. హైదరాబాద్ ఐఐటీతో కలిసి ఈ యాప్‌ను వైద్య ఆరోగ్యశాఖ సిద్ధం చేసింది.
  • Share this:
కరోనా... కరోనా.. కరోనా.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇదే భయం. డబ్బులేనోళ్లే కాదు. డబ్బున్న వాళ్లు కూడా కరోనా చికిత్సకు అయ్యే బిల్లు చూసి భయపడతారేమో. ఆ పేషెంట్‌కు కరోనా వైరస్ తగ్గించడానికి హాస్పటల్ వేసిన బిల్లు చూసి హార్ట్ ఎటాక్ వచ్చినంత పనయింది. అమెరికాలోని సియాటిల్‌లో ఓ కరోనా రోగి కోలుకున్న తర్వాత అతడికి ఆస్పత్రి యాజమాన్యం 1.1 మిలియన్ డాలర్ల బిల్లు వేసింది. అంటే భారత కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ.8.50 కోట్లు. ఈ విషయాన్ని సియాటిల్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. 70 సంవత్సరాల ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకింది. అతడి పని దాదాపు అయిపోయిందని అనుకున్నారు. దేవుడి దయవల్లో, డాక్టర్ల కృషి వల్ల మొత్తానికి ఆ పెద్దాయన బతికి బట్టకట్టాడు. కానీ, ఇప్పుడు బిల్లు చెల్లించాలంటే మాత్రం గుండె గుభేల్ మనేలా వచ్చింది.

మైఖెల్ ప్లోర్ అనే 70 సంవత్సరాల వృద్ధుడు మార్చి 4న కరోనాతో ఆస్పత్రిలో చేరాడు. అతడి పరిస్థితి చూసిన వారు పని అయిపోయిందనుకున్నారు. ఓ దశలో నర్సులు అతడి కుటుంబసభ్యులకు కూడా ఫోన్ చేశారు. వచ్చి ఓ సారి చివరి చూపు చూసుకోండి అని కూడా చెప్పేశారు. కానీ, ఆ పెద్దాయనకు భూమ్మీద నూకలు ఉన్నాయి. 62 రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉన్నాడు. చివరకు మే 5వ తేదీన డిశ్చార్జ్ అయ్యాడు. ఆ సమయంలో అతడికి కంగ్రాట్స్ చెప్పడంతో పాటు ఆస్పత్రి సిబ్బంది 181 పేజీల 1,122,501.04 డాలర్ల బిల్లు కూడా చేతిలో పెట్టింది.

అందులో ఒకరోజు ఐసీయూ ఖర్చు 9,736 డాలర్లు. 42 రోజుల పాటు స్టెరైల్ రూమ్‌లో ఉంచినందుకు సుమారు 409,000 డాలర్లు. 29 రోజుల పాటు వెంటిలేటర్ పెట్టినందుకు మరో 82,000 డాలర్లు ఇలా రకరకాల పేర్లతో బిల్లు వేశారు. ఇంతకీ అదృష్టం ఏంటంటే అతడికి మెడికేర్ ఉంది. అంటే వృద్ధుల కోసం అక్కడి ప్రభుత్వం తీసుకొచ్చిన ఇన్సూరెన్స్ ప్రోగ్రాం అన్నమాట. కాబట్టి, అతడి జేబులో నుంచి డాలర్ కూడా తీయాల్సిన పనిలేకుండా హాయిగా ఇంటికి వెళ్లిపోయాడు. అమెరికాలో హెల్త్ కేర్ వ్యవస్థ ఎంత ఖరీదైందో చెప్పడానికి ఇదొక్క ఉదాహరణ చాలు.
Published by: Ashok Kumar Bonepalli
First published: June 14, 2020, 2:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading