కరోనా రాకుండా ఉండేందుకు టిప్స్ ఇచ్చిన ఉపాసన కొణిదెల..

Instagram/upasanakaminenikonidela

కరోనా రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అపోలో ఫౌండేషన్ నిర్వాహకురాలు ఉపాసన కొణిదెల తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఆమె కొన్ని జాగ్రత్తలు, సూచనలను అందజేశారు.

  • Share this:
    Upasana Kamineni Konidela comments on Coronavirus : తెలంగాాణలో కరోనా బాధితుడిని గుర్తించిన వెంటనే వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వైరస్‌కు ప్రభావితం కాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇప్పటికే చాలా మందిని పరీక్షించింది కూడా. అయితే.. కరోనా రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అపోలో ఫౌండేషన్ నిర్వాహకురాలు ఉపాసన కొణిదెల తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఆమె కొన్ని జాగ్రత్తలు, సూచనలను అందజేశారు. కరోనా వైరస్ వల్ల జ్వరం, తలనొప్పి, ఊపిరితిత్తుల సమస్యలు, దగ్గు, ఒళ్లు నొప్పులు వస్తాయని తెలిపారు. ఈ వైరస్‌ను యాంటీ బయాటిక్స్ అంతమొందించలేవని స్పష్టం చేశారు. అందువల్ల డాక్టర్ల సలహా లేకుండా ఎలాంటి మందులు వేసుకోవద్దని సూచించారు.

    చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, వండని మాంసం తినొద్దని ఆమె తెలిపారు. ‘దగ్గు, ఊపిరితిత్తుల సమస్యలు ఉంటే మాస్కు ధరించడం మేలు. దగ్గు, తుమ్ము లాంటివి వచ్చే వ్యక్తి నుంచి 3 అడుగుల దూరం ఉండటం మంచిది. వేడి ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఉండాలి. హ్యాండ్ సానిటైజర్‌ను వెంట ఉంచుకోవాలి.’ అని ఉపాసన వెల్లడించారు.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: