Home /News /coronavirus-latest-news /

Corona Effect | బ్యాంక్‌లో డబ్బులేస్తున్న యూపీ సీఎం యోగి... రోజుకు రూ.1000

Corona Effect | బ్యాంక్‌లో డబ్బులేస్తున్న యూపీ సీఎం యోగి... రోజుకు రూ.1000

యోగి ఆదిత్యనాథ్

యోగి ఆదిత్యనాథ్

ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో ఆ రాష్ట్రంలో కూలీల పరిస్థితి మరింత దుర్భరంగా మారింది.

    ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో ఆ రాష్ట్రంలో కూలీల పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. ఈ క్రమంలో వారికి జీవనం గడిచేందుకు కూలీల బ్యాంక్ అకౌంట్లలో రోజుకు రూ.1000 చొప్పున వేయాలని నిర్ణయించారు. యూపీలో సుమారు 15 లక్షల మంది దినసరి కూలీలు, 20 లక్షల మంది వరకు భవన నిర్మాణ కూలీలు ఉన్నారు. ఈ 35 లక్షల మందికి లబ్ధి చేకూర్చేలా వారి బ్యాంక్ ఖాతాల్లో రోజుకు రూ.1000 చొప్పున వేయాలని యోగి ఆదిత్యనాథ్ నిర్ణయించారు. ఈ డబ్బులతో కూలీలు తమ కుటుంబం కోసం నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికి, జీవనం గడపడానికి సులువుగా ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు యూపీలో మొత్తం 23 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలో 9 మంది కోలుకున్నారు. మిగిలిన వారికి ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు.

    మరోవైపు కరోనా ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఆధార్‌ ఆధారంగా గ్రామీణ, పట్టణ నిరుపేదలకు ఒక్కొక్కరికి రూ.5,000 నేరుగా వారి ఖాతాకు జమచేయాలనీ కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ప్రధాని నరేంద్ర మోదీని కోరింది. అంతేకాదు బలహీన వర్గాలు, వృద్ధులకు నేరుగా రూ.10,000 అందించాలని, ఆర్థిక భయాలను తొలగించేందుకు ఇది దోహదం చేస్తుందని సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ లేఖ ద్వారా ప్రధాని మోదీని కోరారు. అంతేకాదు పరిశ్రమలు నష్టాల నుంచి గట్టెక్కేందుకు పన్ను తగ్గింపులు, వడ్డీ రేట్ల కోతతోపాటు రూ.2 లక్షల కోట్ల ఆర్థిక ఉద్ధీపన ప్రకటించాలని సీఐఐ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరింది. వ్యాపారాలకు భారీ అంతరాయం రానుందని సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ అ‍న్నారు.

    మరోవైపు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పేదల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. పేదలకు ఇచ్చే రేషన్ బియ్యాన్ని ఆరు నెలల కోటాను ఒకేసారి తీసుకోవడానికి అనుమతి కల్పించింది. ఆరు నెలల రేషన్ బియ్యం, పంచదార, గోధుమలు లాంటివాటివి లబ్ధిదారులు ఒకేసారి తీసుకోవచ్చు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Coronavirus, Uttar pradesh, Yogi adityanath

    తదుపరి వార్తలు