• HOME
  • »
  • NEWS
  • »
  • CORONAVIRUS-LATEST-NEWS
  • »
  • UP BJP MLA SURENDRA SINGH DRINKS COW URINE TO STOP CORONAVIRUS AND RECOMMENDS PEOPLE TO DRINK VIDEO GOES VIRAL SK

Viral Video: ఆవు మూత్రమే కరోనాకు దివ్యౌషధం... తాగి చూపించిన బీజేపీ ఎమ్మెల్యే

Viral Video: ఆవు మూత్రమే కరోనాకు దివ్యౌషధం... తాగి చూపించిన బీజేపీ ఎమ్మెల్యే

ఆవు మూత్రమే కరోనాకు దివ్యౌషధం... తాగి చూపించిన బీజేపీ ఎమ్మెల్యే

ఆవు మూత్రం తాగితే కరోనా రాదంటున్నారు యూపీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే. ఇంతటి కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ తాను ఆరోగ్యంగా ఉండడానికి ఇదే కారణమని చెబుతున్నారు. ఎప్పుడు? ఎంత? ఎలా తాగాలన్న వివరాలతో డెమో వీడియో చేశారు.

  • Share this:
    ప్రస్తుతం మనదేశం కరోనా సెకండ్ వేవ్‌ దెబ్బకు వణికిపోతోంది. రోజుకు 4 లక్షల కొత్త కేసులు.. 4 వేల మరణాలు నమోదవుతున్నాయి. పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌లు విధించినా కరోనా కంట్రోల్ కావడం లేదు. ఇప్పటికే ఎన్నో వ్యాక్సిన్‌లు మార్కెట్లోకి వచ్చాయి. పలు రకాల మందులను కూడా ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఐతే ఇవేవీ అవసరం లేదు.. ఆవు మూత్రం తాగితే కరోనా రాదంటున్నారు యూపీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే. ఇంతటి కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ తాను ఆరోగ్యంగా ఉండడానికి ఇదే కారణమని చెబుతున్నారు. అంతేకాదు ఎంత తాగాలో.. ఎప్పుడు తాగాలో.. ఎలా తీసుకోవాలన్న వివరాలతో డెమో చేశారు. స్వయంగా గోమూత్రం తాగి చూపించారు.

    బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ యూపీలోని బైరియా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కోవిడ్‌ను జయించాలంటే ప్రజలంతా గోమూత్రాన్ని తాగాలని సూచించారు. ప్రతి రోజు ఉదయాన్నే పరిగడుపునే ఆవు మూత్రం తాగాలని చెప్పారు. గ్లాస్ చల్లటి నీళ్లలో 3 మూతల గోమూత్రాన్ని పోసి తీసుకుంటే కరోనా రాదని చెప్పారు. కేవలం కరోనా వైరస్ మాత్రమే కాదు.. ఇలా చేస్తే హృదయ సంబంధ వ్యాధులు కూడా దరిచేరవని సెలవిచ్చారు. గోమూత్రం నేరుగా సేకరించడం అందరికీ సాధ్యమయిందని.. అందుకే పతంజలి గోమూత్రాన్ని తాగాలని చెప్పారు. గోమూత్రం తాగిన తర్వాత అరగంటల వరకూ ఏమీ తినకూడదు.. తాగకూడదని డెమోలో చెప్పారు సురేంద్ర సింగ్. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.



    సురేంద్ర సింగ్ మాత్రమే కాదు.. గతంలో పశ్చిమ బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్‌ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఇది శ్రీకృష్ణుడు జన్మించిన భూమి అని.. ఇక్కడ ఆవులను దేవుడిగా పూజిస్తారని పేర్కొన్నారు. అలాంటి ఆవుల మూత్రాన్ని కరోనా కాదు కదా.. ఏ వైరస్ అయినా పారిపోవాల్సిందేనని అన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఆయుర్వేద గోమూత్రం వంటి ఆయుర్వేద మందులను తీసుకుంటే కరోనా పోతుందని చెప్పారు.

    ఐతే బీజేపీ నేతల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మీ వల్లే జనాలు ఇంకా మూఢ విశ్వాసాలను నమ్ముతున్నారని కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రపంచ దేశాలన్నీ వ్యాక్సిన్‌ను నమ్ముకొని బాగుపడితే.. మనోళ్లు మాత్రం ఇంకా గోమూత్రం వద్దే ఆగిపోయారని సెటైర్లు వేస్తున్నారు. కేవలం టీకాలు, స్వీయ నియంత్రణతోనే కరోనాను కట్టడి చేయగలమని చెబుతున్నారు. కాగా, ఆవు మూత్రం తాగితే కరోనా రాదు అనడానికి ఎలాంటి శాస్త్రీయ అధారాలు లేవు.
    Published by:Shiva Kumar Addula
    First published: