లాక్‌డౌన్ నుంచి మరిన్ని సడలింపులు ఇచ్చింది కేంద్రం. అన్ లాక్2కి సంబంధించి మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ సోమవారం రాత్రి విడుదల చేసింది. దీని ప్రకారం.. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న కంటైన్‌మెంట్ జోన్లలో మాత్రం జూలై 31 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుంది. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అక్కడ అనుమతి ఉంటుంది. దేశమంతటా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ ఉంటుంది. నైట్ కర్ఫ్యూలో నిత్యాసవర సరుకులు రవాణా చేసే వాహనాలు, పరిశ్రమలకు మాత్రమే అనుమతి ఉంటుంది. రాత్రవేళ రైళ్లు, విమానాలు, బస్సుల్లో వెళ్లేవారికి అనుమతి ఉంటుంది.
#UNLOCK2: Lockdown shall continue to remain in force in containment zones till July 31st. In containment zones, only essential activities to be allowed. pic.twitter.com/krHxvKP9a7
— ANI (@ANI) June 29, 2020
విద్యా సంస్థలు, మెట్రో రైళ్లు, జిమ్‌లు, సినిమా హాళ్లు, బహిరంగ సభలు, సామూహిక మత ప్రార్థనలపై జూలై నెలాఖరు వరకు నిషేధం కొనసాగుతుంది. దేశీయ విమానాలు, ప్రత్యేక రైళ్లు ఇప్పటికే పరిమిత సంఖ్యలో రాకపోకలు సాగిస్తుండగా.. మరిన్ని అదనపు సర్వీసులు ప్రారంభించనున్నారు. అంతర్జాతీయ విమాన సర్వీసులపైనా జూలై నెలాఖరు వరకు నిషేధం కొనసాగుతుంది. ఐతే హోంశాఖ అనుమతిచ్చిన విమానాలకు మాత్రం అనుమతి ఉంటుంది. బుధవారం నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronavirus, Covid-19, Lockdown, Lockdown relaxations