అన్‌లాక్ 4కు సంబంధించి ఇప్పటికే కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు మినహా దాదాపు అన్ని కార్యకలాపాలకు అనుమతిచ్చింది. అంతర్రాష్ట్ర ప్రయాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకు ఎలాంటి ఈ-పాస్ అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా.. రాష్ట్రాల మధ్య రాకపోకలపై ఆంక్షలు తొలగాయి. ఏపీ ప్రభుత్వం సైతం ఈ-పాస్ నిబంధనను తొలగించొంది. ఈ నేపథ్యంలో ఈ-పాస్‌తో పని లేకుండానే ఆంధ్రప్రదేశ్‌లోకి ఇతర రాష్ట్రాల ప్రజలు రావచ్చు. రహదారి మార్గంలో రాకపోకలకు స్వేచ్ఛ లభించించడంతో సరిహద్దుల్లోని చెక్‌పోస్టులను ఏపీ అధికారులు తొలగించారు. అయితే అక్రమ మద్యం రవాణా, ఇతర అసాంఘిక కార్యకలాపాలపై నిఘాలో భాగంగా వాహనాలను మాత్రం తనిఖీ చేస్తున్నారు.
కాగా, ఏపీలో కరోనా బీభత్సం కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 4,45,139 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాను జయించి 3,39,876 మంది కోలుకున్నారు. కోవిడ్ బారినపడి 4,053 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 97,681 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నాటికి 37.82 లక్షల మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఏపీ వైద్యఆరోగ్య శాఖ తెలిపింది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.