కరోనా లాక్‌డౌన్‌లో మనం ప్రస్తుతం అన్‌లాక్-3 దశలో ఉన్నాం. సెప్టెంబర్ 1 నుంచి అన్‌లాక్-4 మొదలు కాబోతోంది. దీనికి సంబంధించి మార్గదర్శకాలను సిద్ధం చేసింది. అన్‌లాక్-4లో మరిన్ని ఆంక్షలను సడలించినప్పటికీ విద్యా సంస్థలను మాత్రం తెరవకూడదని కేంద్రం నిర్ణయించింది. స్కూళ్లు, కాలేజీల పున: ప్రారంభానికి సంబంధించి కేంద్రహోంశాఖ నుంచి ఎలాంటి మార్గదర్శకాలను అందుకోలేదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి రాజేశ్ భూషన్ తెలిపారు. ఈ నేపథ్యంలో మరిన్ని రోజుల పాటు స్కూళ్లు, కాలేజీలు మూసివేసే ఉంటాయని తెలుస్తోంది. ఐతే సెప్టెంబర్ 1 నుంచి మాత్రం కాలేజీల్లో ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభం కానున్నాయి.
ఇక అన్‌లాక్4లో మైట్రో రైళ్లకు గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇప్పటికే పలు నగరాల్లో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. మెట్రో సర్వీసులు తెరిచాక ఎలాంటి రూల్స్ పాటించాలో ఈవారాంతంలో మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. ఈసారి బార్లలో కౌంటర్ దగ్గర లిక్కర్ అమ్మేందుకు అనుమతి ఇస్తారని సమాచారం. సిట్టింగ్‌కు ఛాన్స్‌లేదు.. టేక్ ఎవే సర్వీసులకు మాత్రమే అనుమతిస్తారని తెలిసింది. థియేటర్లు, ఆడిటోరియంలు మరో నెలపాటు మూసే ఉంచుతారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
కాగా, ఇండియాలో కొత్తగా 60975 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3167323కి చేరింది. కొత్తగా 848 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 58390కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.8 శాతంగా ఉంది. గత 24 గంటల్లో దేశంలో 66550 మంది రికవరీ అయ్యారు. అంటే... పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఇది మంచి పరిణామం. రికవరీ రేటు దేశంలో మరింత పెరిగి 75.9 శాతానికి చేరింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 704348కి చేరింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona virus, Coronavirus, Covid-19, Lockdown relaxations