హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Unlock 3 Guidelines | నైట్ కర్ఫ్యూ ఎత్తివేత.. జిమ్‌, యోగా సెంటర్లు తీసే తేదీ ఖరారు..

Unlock 3 Guidelines | నైట్ కర్ఫ్యూ ఎత్తివేత.. జిమ్‌, యోగా సెంటర్లు తీసే తేదీ ఖరారు..

ఈనెల 23వ తేదీ వరకు నెల్లూరు నగరం లాక్ డౌన్ కానుంది.

ఈనెల 23వ తేదీ వరకు నెల్లూరు నగరం లాక్ డౌన్ కానుంది.

Unlock 3 Guidelines | కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్‌ను ఆగస్ట్ 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

కేంద్ర ప్రభుత్వం అన్ లాక్ 3 గైడ్ లైన్స్ జారీ చేసింది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న నైట్ కర్ఫ్యూని ఎత్తివేసింది. అంటే, ఇకపై రాత్రి పూట కూడా వ్యక్తులు బయట తిరగవచ్చు. ఇప్పటి వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండేది. కేవలం అత్యవసర వస్తువులు సరఫరా చేసే సంస్థల వాహనాలు, బస్సులు, రైళ్లు మాత్రమే రాత్రి పూట కూడా తిరగడానికి ఆస్కారం ఉండేది. ఇప్పుడు వ్యక్తులు కూడా రాత్రి పూట బయట తిరగవచ్చు. అయితే, కరోనా నిబంధనలు మార్చాలి. రెండు రోజుల క్రితం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం తాజాగా కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్‌ను ఆగస్ట్ 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోంశాఖ జారీ చేసిన నిబంధనల ప్రకారం.. ఆగస్ట్ 31 వరకు కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ కొనసాగుతుంది. ఆగస్ట్ 31 వరకు స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు బంద్ ఉండాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ఆగస్ట్ 5 నుంచి యోగా సెంటర్లు, జిమ్ లు ఓపెన్ చేయవచ్చు. కేంద్రం జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవచ్చు. వందే భారత్ మిషన్ కింద మాత్రమే అంతర్జాతీయ ప్రయాణాలు ఉంటాయి.

మెట్రో రైళ్లు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, పార్కులు, ధియేటర్లు, బార్లు, ఆడిటోరియంలు, సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్యా, సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అనుమతి లేదు. వాటిపై పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుటారు. కంటైన్మెంట్ జోన్లలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు అమలు చేయాలి. కంటైన్మెంట్ జోన్ల ఎంపిక జిల్లా కలెక్టర్ చేతిలో ఉంటుంది.

First published:

Tags: Coronavirus, Lockdown, Lockdown relaxations

ఉత్తమ కథలు