Unlock 2: జులై 27 నుంచి స్కూల్స్ పున:ప్రారంభం..ఏ రాష్ట్రంలో అంటే?

Unlock 2 Updates | కరోనా వ్యాప్తి కట్టడిలోకి వస్తే తప్ప పలు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలను పున:ప్రారంభించే అవకాశంలేదు. అయితే హర్యానా ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: July 1, 2020, 7:16 PM IST
Unlock 2: జులై 27 నుంచి స్కూల్స్ పున:ప్రారంభం..ఏ రాష్ట్రంలో అంటే?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అన్‌లాక్ 2 మొదలుకావడంతో దేశ వ్యాప్తంగా స్కూల్స్, కాలేజీలు ఎప్పుడు తెరవనున్నారన్న అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నాయి. కరోనా వ్యాప్తి కట్టడిలోకి వస్తే తప్ప పలు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలను పున:ప్రారంభించే అవకాశంలేదు.  కాగా జులై 27 నుంచి స్కూల్స్‌ను పున:ప్రారంభించే యోచనలో ఉన్నట్లు హర్యానా విద్యా శాఖ సూత్రప్రాయంగా వెల్లడించింది. జులై 1 నుంచి 26 తేదీ వరకు వేసవి సెలవులుగా ఓ అధికారిక ప్రకటనలో హర్యానా విద్యా శాఖ పేర్కొంది. తద్వారా జులై 27 నుంచి స్కూళ్లను పునంప్రారంభించే యోచనలో ఉన్నట్లు సంకేతాలిచ్చింది. అయితే కాలేజీలు, యూనివర్సిటీలు మాత్రం ఆగస్టు వరకు మూసే ఉంచనున్నట్లు తెలుస్తోంది. యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు, ఇతర సంబంధిత అధికారుల తర్వాత చర్చించిన తర్వాత కాలేజీలను పున:ప్రారంభించే విషయంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు హర్యానా విద్యా శాఖ అధికారులు తెలిపారు. అదే సమయంలో ఆన్‌లైన్ విద్యావిధానాన్ని ప్రోత్సహించనున్నట్లు తెలిపింది.

హర్యానాలో స్కూళ్లు, కాలేజీల పున:ప్రారంభానికి సంబంధించి హర్యానా విద్యాశాఖ మంత్రి కన్వర్ పాల్ గుజ్జర్ ఇది వరకే కీలక వ్యాఖ్యలు చేశారు. జులై మాసంలోనే స్కూళ్లను విడతలవారీగా పున:ప్రారంభిస్తామని..కాలేజీలు, యూనివర్సిటీలను ఆగస్టు మాసంలో తెరవనున్నట్లు చెప్పారు.
First published: July 1, 2020, 7:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading