ఇప్పుడు ఆ పని చేయడం సరికాదు.. అమెరికాపై యూఎన్ఓ కీలక వ్యాఖ్యలు

కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులను నిలిపివేస్తామని ప్రకటించడం ఎంతమాత్రం సమంజసకం కాదని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటేరస్ అభిప్రాయపడ్డారు.

news18-telugu
Updated: April 15, 2020, 1:24 PM IST
ఇప్పుడు ఆ పని చేయడం సరికాదు.. అమెరికాపై యూఎన్ఓ కీలక వ్యాఖ్యలు
ప్రస్తుతం రాష్ట్రంలో 7436 కోవిడ్ 19 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 4766 మంది డిశ్చార్జ్ అయ్యారు. 237 మంది చనిపోయారు.
  • Share this:
కరోనా మహమ్మారి నియంత్రణకు ప్రపంచం మొత్తం తిరుగులేని పోరాటం చేస్తోంది. కరోనా నివారణకు ఎప్పుడు చెక్ పడుతుందో తెలియదు. కరోనా పేరు చెబితేనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థకు తమ వాటా నిధులను నిలిపివేస్తున్నామని అమెరికా ప్రకటించింది. దీంతో ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ స్పందిస్తూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థకు ప్రస్తుత పరిస్థితుల్లో నిధులు నిలిపివేయడం ఎంతమాత్రం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయంపై అమెరికా పునరాలోచించుకోవాలని ఆంటోనియో సూచించారు. ప్రపంచ దేశాలన్నీ సమన్వయంతో ఒక్కతాటికిపైకి వచ్చి కరోనా నియంత్రణకు పోరాడాల్సిన తరుణంలో పాత అంశాలు తవ్వుకోవడం సరికాదని పేర్కొన్నారు.

ప్రపంచ దేశాలన్నీ ప్రపంచ ఆరోగ్య సంస్థకు అండగా నిలివాలని కోరారు. చైనా పక్షపాతిగా వ్యవహరిస్తున్న డబ్ల్యూహెచ్ఓ ప్రపంచానికే పెనుముప్పు తెచ్చిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే.. కరోనా వైరస్ కారణంగా నష్టపోయిన దేశాల్లో అమెరికానే తొలిస్థానంలో నిలిచింది. అమెరికాలో ఇప్పటివరకు 6,12,576 మందికి కరోనా వైరస్ సోకగా, వీరిలో 29,798 మంది చనిపోయారు.
Published by: Narsimha Badhini
First published: April 15, 2020, 1:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading