Smriti Irani Corona: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్

కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ధ్రువీకరించారు.

news18-telugu
Updated: October 28, 2020, 7:32 PM IST
Smriti Irani Corona: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్
స్మృతి ఇరానీ (File)
  • Share this:
కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ధ్రువీకరించారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని స్మృతి ఇరానీ తన ట్విటర్ అకౌంట్‌లో ట్వీట్ చేశారు. ‘ఏదైనా చెప్పడానికి నేను మాటలు వెతుకున్న సందర్భాలు చాలా అరుదు. అందుకే సింపుల్‌గా చెబుతున్నా. నాకు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇటీవల నన్న కలిసిన వారు వీలైనంత త్వరగా కరోనా పరీక్షలు చేయించుకోండి.’ అని స్మృతి ఇరానీ కోరారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తాజాగా బీహీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. బీహార్‌లో జేడీయూ - బీజేపీ కూటమిని గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని కొందరు మంత్రులు కూడా గతంలో కరోనా వైరస్ బారిన పడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. వారంతా కరోనా నుంచి కోలుకున్నారు.



కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన వివరాల ప్రకారం ఇండియాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 79,90,322కి చేరింది. ఈనెల 27న కరోనాతో 508 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 1,20,010కి చేరింది. ప్రస్తుతం దేశంలో కరోనా మరణాల రేటు 1.5 శాతంగా ఉంది. చాలా కాలంగా ఈ రేటు తగ్గట్లేదు. ప్రపంచ దేశాల్లో ఇది 2.65 ఉంది. నిన్న దేశంలో 58,439 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 72,59,509గా ఉంది. దేశంలో రికవరీ రేటు 90.9 శాతంగా ఉంది. ఇదో మంచి పరిణామం. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,10,803 ఉన్నాయి. నిన్న దేశవ్యాప్తంగా 10,66,786 టెస్టులు జరిగాయి. మొన్నటి కంటే ఇవి 108670 ఎక్కువగా ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకూ 10,54,87,680 టెస్టులు జరిగాయి. ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 4.1 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 24 గంటల్లో... 15,054 తగ్గాయి. 26 రాష్ట్రాల్లో కరోనా కొత్త కేసులు తగ్గుతూ ఉంటే... 9 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయి. అవి... తెలంగాణ (26), సిక్కిం (17), నాగాలాండ్ (27), మిజోరం (59), మణిపూర్ (23), హిమాచల్ ప్రదేశ్ (10), హర్యానా (298), ఢిల్లీ (2087), ఛండీగఢ్ (17). ఈ రాష్ట్రాల్లో కూడా కరోనా తగ్గితే... అప్పుడు మనం ఒకింత ఊపిరి పీల్చుకోవచ్చు.

ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసుల్లో అమెరికా టాప్‌లో కొనసాగుతోంది. ఆ తర్వాత ఇండియా రెండోస్థానంలో ఉంది. బ్రెజిల్, రష్యా, ఫ్రాన్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రోజువారీ కొత్త కేసుల్లో అమెరికా, ఇండియా, ఫ్రాన్స్, బ్రెజిల్, బ్రిటన్ టాప్ 5లో ఉన్నాయి. మొత్తం మరణాల్లో అమెరికా టాప్‌లో ఉండగా... బ్రెజిల్ (157,981), ఇండియా తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. రోజువారీ మరణాల్లో అమెరికా టాప్‌లో ఉంది. ఆ తర్వాత బ్రెజిల్, ఫ్రాన్స్, ఇండియా, అర్జెంటినా ఉన్నాయి.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 28, 2020, 7:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading