Javadekar: కేంద్ర మంత్రి జవదేకర్‌కు కరోనా.. ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న నెలకే...

Javadekar: కేంద్ర మంత్రి జవదేకర్‌కు కరోనా.. ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న నెలకే...

కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్

కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. గత రెండుమూడు రోజులుగా తననకు కలిసిన వారంతా ముందు జాగ్రత్తగా టెస్ట్ చేయించుకోవాలని ఆయన సూచించారు. పుణెలోని దీనానాథ్ మంగేష్కర్ హాస్పిటల్‌లో...

  • Share this:
    న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. గత రెండుమూడు రోజులుగా తననకు కలిసిన వారంతా ముందు జాగ్రత్తగా టెస్ట్ చేయించుకోవాలని ఆయన సూచించారు. పుణెలోని దీనానాథ్ మంగేష్కర్ హాస్పిటల్‌లో గత నెలలో జవదేకర్ ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ సులభతరమైందని, మేడిన్ ఇండియా వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమైనవని ఆ సందర్భంలో మంత్రి ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా.. కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గత సంవత్సరం ఆగస్ట్‌లో తొలిసారి యడియూరప్పకు కరోనా సోకింది. అప్పట్లో చికిత్స తీసుకున్న ఆయన కొన్ని రోజులకు కోలుకున్నారు. ఆయన రెండోసారి కరోనా బారిన పడటం గమనార్హం. గత సంవత్సరం ఆగస్ట్‌లో యడియూరప్పకు కరోనా సోకింది. ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పుడు రెండోసారి ఆయనకు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయన కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. జ్వరం రావడంతో కర్ణాటక సీఎం తొలుత రామయ్య మెమోరియల్ హాస్పిటల్‌లో చేరారు. ఆయనకు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో యడియూరప్పను రామయ్య మెమోరియల్ హాస్పిటల్ నుంచి మణిపాల్ హాస్పిటల్‌కు తరలించారు. యడియూరప్ప రెండు రోజుల క్రితం కరోనా టెస్ట్ చేయించుకోగా నెగిటివ్ వచ్చింది. ఇవాళ మరోసారి టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం గమనార్హం. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయాన్ని సీఎం యడియూరప్ప ట్వీట్ ద్వారా వెల్లడించారు. తనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని.. అయితే.. తన ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని, డాక్టర్ల సూచనతో తాను జాగ్రత్తలు పాటిస్తున్నట్లు సీఎం తెలిపారు.

    కొద్ది రోజులుగా తనను కలిసిన వారు ముందు జాగ్రత్తగా సెల్ఫ్ క్వారంటైన్ పాటించాలని ఆయన సూచించారు. సీఎం యడియూరప్పకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. కరోనా నేపథ్యంలో అధికారులతో సమావేశం నిర్వహించిన గంటల వ్యవధిలోనే సీఎంకు పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆ సమావేశంలో పాల్గొన్న అధికారుల్లో టెన్షన్ నెలకొంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయం.


    భారత్‌లో గడచిన 24 గంటల్లో 2,17,353 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. దీంతో.. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 15 లక్షల మార్క్‌ను దాటింది. వరుసగా రెండో రోజు 2 లక్షలకు పైగా కేసులు నమోదు కావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. గడచిన 24 గంటల్లో 1,185 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో.. ఇప్పటివరకూ భారత్‌లో కరోనా మరణాల సంఖ్య 1,74,308కి చేరింది. కరోనా రికవరీ రేటు అనూహ్యంగా పడిపోవడం, కేసుల సంఖ్య ఊహించని విధంగా పెరుగుతుండటంతో సెకండ్ వేవ్ రానున్న రోజుల్లో ఇంకెంత ఉధృతంగా ఉండనుందోనన్న భయం మొదలైంది.
    Published by:Sambasiva Reddy
    First published: