Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా...టెస్టులు చేయించుకోవాలని సన్నిహితులకు విజ్ఞప్తి...

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కరోనావైరస్ సోకింది. ఇదే విషయాన్ని ఆయన స్వయంగా ట్వీట్ చేయడం ద్వారా సమాచారం అందించారు. జాగ్రత్తలు తీసుకొని చికిత్స పొందుతున్నట్లు గడ్కరీ తెలిపారు.

news18-telugu
Updated: September 16, 2020, 10:50 PM IST
Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా...టెస్టులు చేయించుకోవాలని సన్నిహితులకు విజ్ఞప్తి...
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
  • Share this:
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కరోనావైరస్ సోకింది. ఇదే విషయాన్ని ఆయన స్వయంగా ట్వీట్ చేయడం ద్వారా సమాచారం అందించారు.  జాగ్రత్తలు తీసుకొని చికిత్స పొందుతున్నట్లు గడ్కరీ తెలిపారు. అంతేకాదు తనను ఇటీవల సంప్రదించిన ప్రజలు, సిబ్బంది, స్నేహితులు టెస్టు చేయించుకోవాలని గడ్కరీ ట్వీట్ ద్వారా విజ్ఞప్తి చేశారు. తన ఆరోగ్యం బాగానే ఉందని ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ అన్నారు. గత రెండు రోజులుగా అనారోగ్యంగా ఉండగా, వైద్యుడి అభిప్రాయాన్ని తీసుకున్నానని, చెకప్ సమయంలో తాను కరోనా వైరస్ బారిన పడ్డట్లు తెలిపారు.

నితిన్ గడ్కరీ మరొక ట్వీట్‌లో- "తనతో కాంటాక్టులో వచ్చిన ప్రతి వ్యక్తి జాగ్రత్తగా ఉండాలని మరియు ప్రోటోకాల్‌ను అనుసరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మీ గురించి జాగ్రత్తగా చూసుకోండి." అని ట్వీట్ చేశారు. అటు మోడీ ప్రభుత్వంలోని చాలా మంది మంత్రులు, అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, చాలా మంది పెద్ద నాయకులు ఇప్పటివరకు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఒక అంచనా ప్రకారం, దేశంలో 200 మందికి పైగా మంత్రులు, అగ్ర నాయకులు కరోనా పాజిటివ్ అయ్యారు. అయితే, వారిలో ఎక్కువ మంది కోలుకొని తిరిగి పనిలోకి వచ్చారు.




కేంద్ర మంత్రుల్లో... కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్, కృష్ణపాల్ గుర్జర్, శ్రీపాద్ నాయక్, అర్జున్ రామ్ మేఘవాల్, గజేంద్ర సింగ్ షేఖావత్ వంటి అనేక మంది మంత్రులు కరోనా వైరస్ బారిన చిక్కుకున్నారు. వీరితో పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కర్ణాటక సిఎం బిఎస్ యడ్యూరప్ప, హర్యానా సిఎం మనోహర్ లాల్ ఖట్టర్ కరోనా సోకింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ కరోనా సోకింది. అదే సమయంలో, ఇద్దరు క్యాబినెట్ మంత్రులు చేతన్ చౌహాన్, ఉత్తర ప్రదేశ్ కు చెందిన కమలా రాణి వర్మ కరోనా నుండి మరణించారు.
Published by: Krishna Adithya
First published: September 16, 2020, 10:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading