ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ఉద్రిక్తత... కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏమన్నారంటే...

వివిధ రాష్ట్రాలు, ప్రభుత్వ శాఖలు,అధికారుల మధ్య సమన్వయ లోపం లేకుండా ఉండాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

news18-telugu
Updated: March 26, 2020, 10:29 PM IST
ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ఉద్రిక్తత... కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏమన్నారంటే...
కిషన్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీ, తెలంగాణ బోర్డర్‌లో విద్యార్థులు ఇబ్బంది పడటానికి కారణం రాష్ట్రాల మధ్య సమన్వయం లేకపోవడమేనని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. లాక్ డౌన్ కు ప్రజలు అందరూ సహకరించాలని ఎక్కడ ఉన్న వారు అక్కడే స్వీయ జాగ్రత్తలు తీసుకుంటూ ప్రభుత్వ సూచనలు పాటించాలని కిషన్ రెడ్డి అన్నారు. హోం మంత్రిత్వ శాఖ కరోనా వ్యాప్తి అడ్డుకట్ట వేయడం కోసం నార్త్ బ్లాక్ లో జాతీయ స్థాయిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిందని కిషన్ రెడ్డి తెలిపారు. ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ కు తాను ఇంఛార్జ్ బాధ్యతలు ఈరోజు నుంచి నిర్వహించడం ఓ గురుతర బాధ్యతగా స్వీకరించినట్లు తెలిపారు.

వివిధ రాష్ట్రాలు, ప్రభుత్వ శాఖలు,అధికారుల మధ్య సమన్వయ లోపం లేకుండా ఉండాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రజలు సొంత రాష్ట్రాలు...లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా వారికి అన్ని ఏర్పాట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడే చేయాలని కిషన్ రెడ్డి సూచించారు. ఈ తరుణంలో ప్రయాణాలు ప్రమాదమని ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండటం ఉత్తమమని,రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను కఠినంగా అమలుచేయాలని కోరారు. సరిహద్దుల్లో ఎటువంటి వాహనాలకు అనుమతి ఉండదని కిషన్ రెడ్డి తెలిపారు. నేడు తన దృష్టికి వచ్చిన వారాణసిలో చిక్కుకుపోయిన తెలుగు వారికి ఆక్కడే వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

లాక్ డౌన్ నేపథ్యంలో చిన్న, మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు కేంద్రం లక్షా 70 వేల కోట్లతో 80 కోట్ల రూపాయలతో ప్రజలకు ప్రయోజనం చేకూర్చనుందని తెలిపారు. ప్రజలంతా సహకరిస్తే కరోననే మన దేశం నుంచి పారిపోయేలా చేస్తామని కిషన్ రెడ్డి అన్నారు. మన దేశంలో కరోన వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించారని అన్నారు. దీనిని ఎవరు తేలిగ్గా తీసుకోవద్దని కిషన్ రెడ్డి కోరారు. తెలుగు రాష్ట్రాల్లోనూ దేశంలోనూ ఏ సమస్య వచ్చినా తనతో పాటు ఆదుకోవడానికి కేంద్రం సిద్ధంగా ఉందని కిషన్ రెడ్డి తెలియజేశారుFirst published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు