ఆ పరిస్థితి లేదు... కరోనాపై కేంద్ర ఆరోగ్య మంత్రి వివరణ

మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, డిల్లీ, తెలంగాణ, యూపీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనే కరోనా కేసుల శాతం అధికంగా ఉంది.

news18-telugu
Updated: July 9, 2020, 3:14 PM IST
ఆ పరిస్థితి లేదు... కరోనాపై కేంద్ర ఆరోగ్య మంత్రి వివరణ
కేంద్రమంత్రి హర్షవర్ధన్(ఫైల్ ఫోటో)
  • Share this:
దేశం మొత్తాన్ని పరిశీలిస్తే భారత్‌లో కరోనా మహమ్మారి సామాజిక వ్యాప్తి స్థాయికి చేరుకోలేదని కేంద్రం వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. కొన్ని ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉందనే విషయాన్ని అంగీకరించిన కేంద్రమంత్రి... దేశం మొత్తాన్ని పరిశీలిస్తే భారత్‌లో సామాజిక వ్యాప్తి లేదని స్పష్టం చేశారు. కరోనా కారణంగా అత్యధికంగా ప్రభావితమై దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉందనే విషయాన్ని సరైన కోణంలో అర్థం చేసుకోవాలని ఆయన తెలిపారు. జనాభా పరంగా చూస్తే భారత్ ప్రపంచంలోనే రెండో అతి పెద్ద దేశమన్న కేంద్రమంత్రి... మన దగ్గర ప్రతి పది లక్షల జనాభాకు 558 కరోనా కేసులు ఉన్నాయని చెప్పారు.

అయితే ఈ విషయంలో ప్రపంచ సగటు 1,453 కేసులు అని తెలిపారు. కాగా, నేటి వరకు భారత్‌లో 7,67,296 కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, డిల్లీ, తెలంగాణ, యూపీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనే కరోనా కేసుల శాతం అధికంగా ఉంది. ఇప్పటివరకూ నమోదైన కేసుల్లో ఈ రాష్ట్రాల వాటా దాదాపు 75 శాతమని తాజా లెక్కలు సష్టం చేశాయి.

Published by: Kishore Akkaladevi
First published: July 9, 2020, 3:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading