స్వదేశానికి భారతీయుల తరలింపు... చివరగా విద్యార్థులు

మే 7వ తేదీ నుండి నుండి విమానాలు, నౌకల ద్వారా విదేశాల నుండి భారతీయులను తరలించే కార్యక్రమం మొదలవుతుంది.

news18-telugu
Updated: May 6, 2020, 6:08 PM IST
స్వదేశానికి భారతీయుల తరలింపు... చివరగా విద్యార్థులు
Air India Jobs: ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కరోనా మహమ్మారి నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను మన దేశానికి చేర్చేందుకు భారత ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద తరలింపు కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఇందుకోసం మే 7వ తేదీ నుండి నుండి విమానాలు, నౌకల ద్వారా విదేశాల నుండి భారతీయులను తరలించే కార్యక్రమం మొదలవుతుంది. ఇప్పటికే మొత్తం 1,90,000 మంది భారతీయులు ఆయా దేశాల్లో ఉన్న రాయబార కార్యాలయాల్లో, హైకమీషన్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకున్నారు. విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని తిరిగి తీసుకొచ్చే క్రమంలో మొదటగా ఆయా దేశాల నుండి వెలి వేయబడినవారికి ప్రాధాన్యత ఇస్తారు.

ఆ తరువాత వీసా గడువు ముగిసినవారు, వలస కార్మికులు, ఆరోగ్యరీత్యా భారత్‌లోని ఆసుపత్రుల్లో అత్యవసర చికిత్స అవసరమైనవారు. గర్భిణీ స్త్రీలు, భారత్ లో చనిపోయిన వారి బంధువులు. ఆయా దేశాల్లో చిక్కుకున్న పర్యాటకులు, చివరగా విదేశాల్లో హాస్టల్లు మూతబడి ఇబ్బందులు ఎదుర్కుంటున్న విద్యార్థులను స్వదేశానికి తరలించనున్నారు. మొదటి దశలో వాయు మార్గాన 13 దేశాల నుండి 14,800 మంది భారతీయులను 64 విమానాల్లో భారత్ కు తీసుకురానున్నారు. మొదటి దశలో అమెరికా, బ్రిటన్, సింగపూర్, ఫిలిప్పీన్స్, బాంగ్లాదేశ్, యుకె, యు ఏ ఈ, సౌదీ, ఖతార్, ఒమాన్, బహ్రెయిన్ వంటి 12 దేశాలకు భారత విమానాలు చేరుకొని అక్కడున్న భారతీయులను తిరిగి తీసుకురానున్నాయి.

సామాజిక దూరాన్ని పాటించే విధంగా ఒక్కో విమానంలో 200 నుండి 300 మందిని తీసుకురానున్నారు. భారత్‌కు రావాలనుకునే వాళ్లు కరోనా పరీక్షలు చేయించుకుని సర్టిఫికెట్ పొంది ఉండాలి. వారు భారత్‌కు చేరుకున్న తర్వాత కూడా పరీక్షలు నిర్వహిస్తారు. ఈ రకంగా విదేశాల నుండి వచ్చిన ప్రతి వ్యక్తి 14 రోజుల పాటు క్వారంటైన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు క్వారంటెన్ కేంద్రాలను నిర్వహిస్తాయి. అదే విధంగా రక్షణశాఖ ఆధ్వర్యంలోని నౌకల ద్వారా కొన్నిదేశాల నుండి భారత్‌కు తీసుకువచ్చే కార్యక్రమం కొనసాగనుంది.
Published by: Kishore Akkaladevi
First published: May 6, 2020, 6:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading