Covishield: కోవిషీల్డ్‌కు 66 కోట్ల వ్యాక్సిన్ డోసుల ఆర్డర్ పెట్టిన కేంద్రం.. ఆ నెలలోగా రానున్న టీకాలు

కోవిషీల్డ్ వ్యాక్సిన్ (ప్రతీకాత్మక చిత్రం)

Covishield: ఆగస్టు నుండి డిసెంబరు మధ్యకాలంలో 37.50 కోట్ల డోసుల కోసం కోవిషీల్డ్ కోసం కేంద్రం ఆర్డర్ ఇచ్చిందని.. అయితే సీరం సంస్థ సెప్టెంబర్ మధ్యలో ఈ డోసుల సరఫరాను పూర్తి చేయబోతోందని తెలుస్తోంది.

  • Share this:
    దేశంలో ఎన్ని కరోనా వ్యాక్సిన్లు ఉన్నప్పటికీ.. ఎక్కువగా అందుబాటులో ఉన్నది మాత్రం కోవిషీల్డ్ అని చెప్పొచ్చు. సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) తయారు చేసిన కోవిషీల్డ్ డోసులే ఎక్కువమంది తీసుకున్నారు. ఇప్పటికే 60 కోట్లకు పైగా డోసులను కోవిషీల్డ్ అందించింది. జనవరిలో 2.1 కోట్లు, ఫిబ్రవరిలో 2.5 కోట్లు, మార్చిలో 4.73 కోట్లు, ఏప్రిల్‌లో 6.25 కోట్లు, మేలో 5.96 కోట్లు, జూన్‌లో 9.68 కోట్లకు పైగా డోసులను సంస్థ అందించింది. కాగా, కోవిషీల్డ్‌ కంపెనీ నుంచి 66 కోట్ల డోసుల కోసం కేంద్రం సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో కొత్త కొనుగోలు ఆర్డర్‌ను జారీ చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్‌లో సీరం సంస్థ 20.29 కోట్ల డోసులను ప్రభుత్వానికి సరఫరా చేయనుంది. డిసెంబర్ నాటికి 60 కోట్ల డోసులను సరఫరా చేయాలని ప్రభుత్వం ఆర్డర్ జారీ చేసినట్టు తెలుస్తోంది.

    ఇదిలా ఉంటే పూణెకి చెందిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) కోవిషీల్డ్ తయారీ సామర్థ్యాన్ని నెలకు 20 కోట్ల కంటే ఎక్కువ మోతాదులకు పెంచింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ జూలైలో 28.50 కోట్ల డోసుల కోవాగ్జిన్ సరఫరా కోసం భారత్ బయోటెక్‌కు ఆర్డర్ ఇచ్చింది, అయితే వాటి సరఫరాను ఇంకా ప్రారంభించలేకపోయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. భారత్ బయోటెక్ ఐదు కోట్ల మోతాదుల కోవాగ్జిన్ డోసుల సరఫరా పూర్తి చేయడానికి దగ్గరగా ఉందని తెలుస్తోంది. దీని కోసం ఆరోగ్య మంత్రిత్వశాఖ మార్చి 12న ఆర్డర్ ఇచ్చింది.

    ఇక ఆగస్టు నుండి డిసెంబరు మధ్యకాలంలో 37.50 కోట్ల డోసుల కోసం కోవిషీల్డ్ కోసం కేంద్రం ఆర్డర్ ఇచ్చిందని.. అయితే సీరం సంస్థ సెప్టెంబర్ మధ్యలో ఈ డోసుల సరఫరాను పూర్తి చేయబోతోందని తెలుస్తోంది. ఆగస్టు 31న నాటికి దేశంలోని ప్రజలకు 65 కోట్ల వ్యాక్సిన్ డోసులను అందించారు.

    Harish Rao: టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్‌ హరీశ్‌రావుకు వింత పరిస్థితి.. ప్లస్సా ? మైనస్సా ?

    Children Sleeping Hours: ఏ వయసు పిల్లలకు ఎంత నిద్ర అవసరమో తెలుసా ?.. కచ్చితంగా తెలుసుకోండి.. లేదంటే..

    మహమ్మారి కారణంగా తమ ఉద్యోగులు రకరకాల సవాళ్లు ఉన్నప్పటికీ సమర్థవంతంగా పని చేస్తున్నారని సీరం సంస్థలో పని చేస్తున్న ప్రకాశ్ కుమార్ సింగ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు గతంలోనే లేఖ రాశారు. సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎల్లప్పుడూ దేశం, ప్రపంచంలోని పౌరుల రక్షణ గురించి నిజాయితీగా పని చేస్తోందని పేర్కొన్నారు. తమ సంస్థ కోవిడ్ -19 మహమ్మారిపై పోరాడటానికి ప్రభుత్వంతో కలిసి పని చేస్తోందని తెలిపారు.
    Published by:Kishore Akkaladevi
    First published: