ప్రధాని మోదీ సంచలన నిర్ణయం.. ఎంపీల జీతాల్లో భారీగా కోత

ఏడాది పాటు ఎంపీల జీతాల్లో 30శాతం విధించాలని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులు కూడా ఇది వర్తించనుంది.

news18-telugu
Updated: April 6, 2020, 4:31 PM IST
ప్రధాని మోదీ సంచలన నిర్ణయం.. ఎంపీల జీతాల్లో భారీగా కోత
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర కేబినెట్ సమావేశం
  • Share this:
ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రభుత్వానికి రాబడి తగ్గిపోవడంతో ఎంపీల జీతాల్లో భారీగా కోత విధించారు. ఏడాది పాటు ఎంపీల జీతాల్లో 30శాతం విధించాలని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులకు కూడా ఇది వర్తించనుంది. అంతేకాదు రెండేళ్ల పాటు ఎంపీ లాడ్స్ నిధుల కూడా మంజూరు చేయలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రెండేళ్ల పాటు ఎంపీ ల్యాడ్స్ నిధులు రద్దు చేస్తే ఆ మొత్తం రూ.7900 కోట్లు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా (సంఘటిత నిధి)కి వెళ్తాయి. అటు మాజీ ఎంపీల పెన్షన్‌లోనూ 30శాతం కోత పడనుంది.

ఈ మేరకు పార్లమెంట్ సభ్యులు జీతాలు, పెన్షన్ల చట్టం-1954ని సవరిస్తూ.. సోమవారం కేంద్రం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఇక రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్రాల గవర్నర్‌లు కూడా 30శాతం తక్కువ జీతం తీసుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఆ నిధులన్నీ కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకు వెళ్తాయని కేంద్రమంత్రి ప్రకాశ్ జావదేకర్ మీడియాకు తెలిపారు. ఏప్రిల్ 1, 2020 నుంచి ఇది అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేశారు.First published: April 6, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading