కరోనాపై సీఎం జగన్‌కు ఉండవల్లి సలహా...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ రాశారు.

news18-telugu
Updated: July 30, 2020, 10:52 PM IST
కరోనాపై సీఎం జగన్‌కు ఉండవల్లి సలహా...
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (ఫైల్ ఫొటో)
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ రాశారు. కరోనా రోగులను ఆదుకోవడంలో ఓ సలహా ఇచ్చారు. కరోనా రోగులకు సహాయం చేసేందుకు రాష్ట్రంలోని ఫంక్షన్లను స్వాధీనం చేసుకోవాలని చెప్పారు. వాటి నిర్వహణ బాధ్యతలను ఎన్జీవోలు, ట్రస్టులకు అప్పగించాలని సూచించారు. ఆ ఫంక్షన్ హాల్స్ ఖర్చులను ఎన్జీవోలు, ట్రస్టులు భరిస్తాయని, ప్రభుత్వం నుంచి వైద్యులు, వైద్య సిబ్బందిని కేటాయిస్తే సరిపోతుందన్నారు. ఈ సందర్భంగా రాజమండ్రిలో జైన్ సంఘం ఓ ఫంక్షన్ హాల్ తీసుకుని 60 పడకలతో కరోనా సెంటర్‌ను నడుపుతుందనే విషయాన్ని లేఖలో ఉండవల్లి ప్రస్తావించారు. ఇక ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలకు అనుమతించి ఫీజును ప్రభుత్వం నిర్ణయించాలన్నారు. ప్రస్తుతం డబ్బు, పలుకుబడి ఉంటేనే కరోనా నుంచి బయటపడగలమనే అభిప్రాయంతో ప్రజలు ఉన్నారని, అలాంటి భావన నుంచి వారిని బయటపడేయాలన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో ఏపీలో 10,167 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 1,30,557కి పెరిగింది. అలాగే, గత 24 గంటల్లో ఏపీలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 68గా ఉంది. దీంతో కలిపి మొత్తం ఏపీలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 1281కి పెరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో 9, గుంటూరు జిల్లాలో 9, అనంతపురంలో 8, కర్నూలు 8, విశాఖపట్నంలో 8, చిత్తూరులో 6, కడపలో 6, ప్రకాశం 4, విజయనగరంలో 4, కృష్ణాలో ముగ్గురు, నెల్లూరులో ఒకరు, శ్రీకాకుళంలో ఒకరు, పశ్చిమ గోదావరిలో ఒకరు కరోనాతో మరణించారు.

ఏపీలోని తూర్పుగోదావరిలో 1441, కర్నూలులో 1252, విశాఖపట్నంలో 1223 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక పశ్చిమ గోదావరిలో 998, అనంతపురంలో 954, గుంటూరులో 946, కడపలో 753, నెల్లూరులో 702, శ్రీకాకుళంలో 586, చిత్తూరులో 509, ప్రకాశంలో 318, కృష్ణాలో 271, విజయనగరంలో 214 కరోనా కేసులు నమోదయ్యాయి.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 30, 2020, 10:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading