HOME »NEWS »Corona vilayatandavam »uks new coronavirus strain poses serious risks to children too says experts sk gh

Corona 2.0: తల్లిదండ్రులూ బీ అలర్ట్.. యూకే కరోనాతో పిల్లలకు పొంచి ఉన్న ముప్పు

Corona 2.0: తల్లిదండ్రులూ బీ అలర్ట్.. యూకే కరోనాతో పిల్లలకు పొంచి ఉన్న ముప్పు
ప్రతీకాత్మకచిత్రం

యూకే ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు పాత వైరస్‌తో పోలిస్తే ఈ కొత్త కరోనా వైరస్ వల్ల చిన్నపిల్లలకు ప్రమాదమెక్కువగా (Risk on children) ఉంటుందని తెలుస్తోంది.

  • Share this:
2020 ఆద్యంతం కరోనా వైరస్(Covid-19) తాకిడితో ప్రపంచం అతలాకుతలమైంది. ఏడాది ముగింపుకు కరనా ప్రభావం తగ్గుతుందనుకున్న నేపథ్యంలో కొత్త కరోనా వైరస్(Corona new Strain) మళ్లీ భయాన్ని కలగజేస్తోంది. ఇటీవలే యూకేలో బయటపడి ఈ కొత్త వైరస్ వైద్య నిపుణులు, పరిశోధకులతో పాటు సామాన్య ప్రజానీకానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే ఈ కొత్త వైరస్ గురించి సమాచారం అంతగా లేకపోయినప్పటికీ పాత వైరస్ తో పోలిస్తే చికిత్స విధానం, వ్యాప్తి, తీవ్రత, వ్సాక్సిన్ లాంటి వాటిపై సందేహాలు ప్రజలకు కలుగుతున్నాయి. పాత వైరస్ తో పోలిస్తే కొత్త దాంట్లో సారుప్యతలు, తేడాలు ఉన్నప్పటికీ దీని గురించి సమగ్రంగా అన్వేషించాల్సిన ఆవశ్యకత ఉంది.

కొత్త వైరస్ వల్ల చిన్న పిల్లలకు ప్రమాదమా..


యూకే ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు పాత వైరస్‌తో పోలిస్తే ఈ కొత్త కరోనా వైరస్ వల్ల చిన్నపిల్లలకు ప్రమాదమెక్కువగా (Risk on children) ఉంటుందని తెలుస్తోంది. లండన్ ఇంపీరియల్ కళాశాల ఆచార్యుడు, ఎపిమియోలాజిస్ట్ నీల్ ఫేర్గ్యూసన్ ప్రకారం ఈ కొత్త మహమ్మారి వల్ల చిన్నారుల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుందని, పెద్దవారి కంటే చిన్నపిల్లల్లో ప్రమాదముండే అవకాశముందని అనుమానం వ్యక్తం చేశారు. నివేదిక ప్రకారం నవంబరులో పాఠశాలలు తిరిగి ప్రారంభించినప్పుడు పిల్లల్లో అధిక సంక్రమణ రేటు నమోదవుతుందని, నూతన వైరస్ వల్ల పిల్లలు అధిక ప్రమాదం కలిగించే అవకాశముందని ఫెర్గ్యూసన్ అన్నారు.

50 నుంచి 70 శాతం రిస్క్ ఎక్కువ..
ఈ కొత్త వైరస్ ప్రభావం యుక్త వయస్సు, చిన్నపిల్లల్లో 50 నుంచి 70 శాతం ఎక్కువ తీవ్రత ఉంటుందని పరిశోధకులు నమ్ముతున్నారు. అయితే ప్రాణాంతకమని, పెద్దలు లేదా పిల్లల్లో తీవ్రమైన వ్యాధికి కారణమవుతుందని నమ్మట్లేదు. ప్రొఫెసర్ ఫెర్గ్యూసన్ ప్రకారం ఈ సిద్ధాంతాన్ని నిరూపించడానికి పరిశోధనలు, ఆధారాలు అవసరమని చెప్పారు. ఐతే ఇప్పటికే ఉన్న నివేదికల ప్రకారం 15 ఏళ్లలోపు పిల్లల్లో నూతన వేరియంట్ కేసుల సంఖ్యగణనీయంగా ఉంటుంది.

వాస్తవిక కేసుల సంఖ్య ఇంకా ఎక్కువ..
ఇతర నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రిలిమినరీ డేటాలో ఎలాంటి రుజువు లేదని తెలిపారు. కొత్త వైరస్(New Mutant Virus) జాతికి చెందిన రెండు ప్రారంభ నమూనాలను సెప్టెంబరు 20న కెంట్‌లో, లండన్ లో మరోకటి సేకరించారు. డిసెంబరు నాటి ఇంగ్లాండ్ అంతటా వేర్వేరు స్థానిక అధికారుల్లో 1000 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. అయితే వాస్తవిక సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశముంది. ప్రధానంగా కొత్త వైరస్ ఆగ్నేయ ఇంగ్లాండ్, కెంట్, లండన్‌లో కనుగొన్నారు.

కొత్త వైరస్ సులభంగా ప్రవేశిస్తుంది..
పిల్లల్లో ఎక్కువగా కోవిడ్-19 కేసులు బహిర్గతమవ్వలేదు. వారి కణాల్లో ACE2 గ్రాహకాలు తక్కువ ఉండటమే దీనికి కారణం. "పాత వైరస్ కు.. ACE2ను బంధించడం, కణాల్లో ప్రవేశించం చాలా కష్టతరంగా ఉంటుంది. అందువల్ల ముక్కు, గొంతులో ACE2 పుష్కలంగా ఉన్న కారణంగా పెద్దలు వీటికి సులభమైన లక్ష్యాలు. పిల్లలకు సోకడం కష్టం. కొత్త వైరస్ చాలా సులభంగా పిల్లలు, పెద్దల్లో ప్రవేశించేందుకు సమానావకాశాలు ఉన్నాయి" అని ఓ నిపుణుడు తెలియజేశారు. వారి మిశ్రమ సరళిని బట్టి ఎక్కువ మంది పిల్లలకు కొత్త కరోనా వైరస్ సోకే అవకాశముంది.
Published by:Shiva Kumar Addula
First published:December 24, 2020, 12:30 IST

टॉप स्टोरीज