మాస్కు లేదని.. ఏకంగా దానినే మాస్కుగా ధరించిన మహిళ

మాస్కు లేదని.. ఏకంగా దానినే మాస్కుగా ధరించిన మహిళ

(photo : Twitter)

కోవిడ్ కాలంలో ఎక్కడికెళ్లినా మాస్కులు ధరించాల్సిందే. అయితే ఏదో హడావిడిలో పడి మరిచిపోయిన వారికి పోలీసుల ఫైన్ అటుంచి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉండటంతో తమ దగ్గర ఉన్నవాటినే మాస్కులుగా వాడుతున్నారు.

 • News18
 • Last Updated:
 • Share this:
  మాయదారి రోగం కరోనా తీసుకొచ్చిన బాధలు అన్నీ ఇన్నీ కావు. జేబులో శానిటైజర్, ముఖానికి మాస్కు లేనిదే ఇంటి నుంచి కాలు బయటకు అడుగు పెట్టలేం. ఒకవేళ బయటకెళ్లినా.. ఎవరికి కరోనా ఉందో..? ఎవరు దగ్గుతున్నారో..? ఎవరు ఏ ఏ సమస్యలతో బాధపడుతున్నారో..? అనే గందరగోళం. పోలీసుల జరిమానాలు సరేసరి. ఇవన్నింటిని నుంచి తప్పించుకోవడానికైనా, కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికైనా ముఖానికి మాస్కులు ఉండాల్సిందే. అయితే ఇంగ్లాండ్ కు చెందిన ఓ మహిళ.. ఇంటి నుంచి షాపింగ్ కు అని బయిటకొచ్చి.. మాస్కు తీసుకురావడం మరిచిపోయింది. దీంతో కారులో ఉన్న శానిటరీ ప్యాడ్ నే మాస్కులా మార్చింది. అసలేమైంది..?

  గ్రేటర్ మాంచెస్టర్ కు చెందిన రాచెల్ టేలర్.. షాపింగ్ కోసమని బయటకు వచ్చింది. తీరా షాపింగ్ మాల్ కు వెళ్లే సరికి ఆమెకు అసలు విషయం తెలిసింది. ఇంట్లో మాస్కు మరిచిపోయిన ఆమె.. కార్లో ఏమైనా ఉన్నాయో అని వెతికింది. కానీ ఒక్క మాస్కు కూడా కనిపించలేదు. ఇంతలోనే.. కార్ లో శానిటరీ ప్యాడ్ (మహిళలు పీరియడ్స్ టైం లో ధరించేది) కనిపించింది. మరో ఆలోచన లేకుండా.. టేలర్ దానిని తీసి మాస్కుగా పెట్టకుని షాపింగ్ చేసుకుంది. ఇందుకు సంబంధించి అక్కడున్న పలువురు.. ప్యాడ్ ను మాస్కుగా పెట్టుకుని షాపింగ్ చేస్తున్న టేలర్ ఫోటోను తీశారు. అద కాస్తా సోషల్ మీడియాలో పోస్టు చేయడంతోఅది కాస్తా వైరలైంది.

  దీనిపై టేలర్ స్పందిస్తూ.. ‘నేను ఇంట్లో మాస్కు మరిచిపోయాను. కారులో ఏమైనా మాస్కులు ఉన్నాయేమోనని చూశాను. కానీ ఒక్కటీ కనిపించలేద. కానీ నాకు ప్యాడ్ కనిపించింది. దానిని పెట్టుకుంటే చాలా మంది నవ్వుకుంటారని, హేళన చేస్తారని తెలుసు. కానీ నా ముఖం దాచుకోవడం నాకు అవసరం’ అని తెలిపింది. కోవిడ్ నుంచి రక్షించుకోవడంలో ప్యాడ్ నాకు సాయపడిందని ఆమె తెలిపింది.  ఇటువంటి ఘటనే గతంలోనూ ఒకటి జరిగింది. స్కాట్లాండ్ కు చెందిన ఒక వృద్ధుడు... షాపింగ్ చేస్తూ మూతికి శానిటరీ న్యాప్ కిన్ ను పెట్టుకున్నాడు. ఇది కూడా ఇంటర్నెట్ లో వైరలైంది.
  Published by:Srinivas Munigala
  First published:

  అగ్ర కథనాలు