హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

UK Virus: ‘పాపాత్ములు, డబ్బున్న వారికే కొత్త వైరస్, పేదోళ్లకు రాదు’

UK Virus: ‘పాపాత్ములు, డబ్బున్న వారికే కొత్త వైరస్, పేదోళ్లకు రాదు’

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

యూకే వైరస్. ప్రస్తుతం భారత్ సహా ప్రపంచంలోని దేశాలను వణికిస్తున్న పేరు. యూకేలో గుర్తించిన ఈ కరోనా వైరస్ కొత్త రకం స్ట్రెయిన్ 70 శాతం వేగంగా విస్తరిస్తోందనే ప్రచారంతో ప్రజలు భయపడిపోతున్నారు.

  యూకే వైరస్. ప్రస్తుతం భారత్ సహా ప్రపంచంలోని దేశాలను వణికిస్తున్న పేరు. యూకేలో గుర్తించిన ఈ కరోనా వైరస్ కొత్త రకం స్ట్రెయిన్ 70 శాతం వేగంగా విస్తరిస్తోందనే ప్రచారంతో ప్రజలు భయపడిపోతున్నారు. ఇటీవల కాలంలో బ్రిటన్ నుంచి తమ దేశాలకు వచ్చిన వారిని అందరినీ వెతికి వెతికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు దేశంలోని వైద్య సిబ్బంది. అయితే, ఈ కొత్తరకం వైరస్ పేదవారికి రాదని, కేవలం డబ్బున్న వారికి మాత్రమే వస్తుందని చెబుతున్నారు ఓ గురూజీ. ఓ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవిశ్రీ గురూజీ ఈ కామెంట్స్ చేశారు. ‘ఇప్పుడు వచ్చే కొత్త వైరస్ పేదవారికి ఎవరికి రాదు. ఇది నా రిసెర్చ్‌లో కనుక్కున్నా. పొద్దున్నే లేచి కష్టపడే పేద కుటుంబాలు, రాత్రి త్వరగా పడుకునే వారు, ప్రశాంతంగా ఉండే వారికి ఎవరికీ ఇది రాదు. ఎవరైతే డబ్బులతో తులతూగుతారో, విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారో వారికి కచ్చితంగా వస్తుంది. ఇంతకు ముందు వచ్చిన కరోనా కంటే పెద్దగా ఇది రాదు. కానీ, కొత్త వైరస్ ఒకసారి వచ్చిందంటే వాళ్ల పని ఔట్. ఇంకా డౌట్ లేదు. ఎవరైతే మోసం, దగా, కుట్రలు చేసి డబ్బులు సంపాదిస్తారో వారికి వస్తుంది. చెడుకు చెడు లాగా, అలాంటి వారిని కొత్త వైరస్ దెబ్బతీస్తుంది.’ అని కామెంట్ చేశారు.

  గతంలో వచ్చిన కోవిడ్ పేద, గొప్ప తారతమ్యం లేకుండా అందరికీ వచ్చిందని, కొత్త స్ట్రెయిన్ మాత్రం కేవలం డబ్బున్న వారికి మాత్రమే వస్తుందన్నారు. ‘ఇప్పుడు కొత్త కరోనా సోకిందంటే వాళ్లు పాపిష్టులు. అమ్మానాన్నకు భోజనం చేయలేదు. చేయరానిది చేశాడనుకోవాలి. సోషల్ డిస్టెన్స్ పాటించకుండా తిరిగినా కూడా పాపమే. బార్, పబ్బులకు తిరిగే వారికి వస్తుంది. ఎండలో కష్టపడే వారికి రాదు.’ అని స్పష్టం చేశారు.

  అలా అని ఎవరూ నిర్లక్ష్యం వహించకూడదన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని సూచించారు. అలాగే, భౌతిక దూరం పాటించాలన్నారు. కష్టపడి, న్యాయమైన దారిలో వెళ్లాలని సూచించారు.

  ఇక తెలంగాణలో డిసెంబర్ 9 నుంచి ఇప్పటి వరకు 1200 మంది బ్రిటన్ నుంచి వచ్చారని.. వీరిలో 926 మందిని గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహించామని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటివరకు ఫలితాలు వచ్చిన వారిలో 16 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన వారిలో హైదరాబాద్ నుంచి నలుగురు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుంచి నలుగురు, జగిత్యాల జిల్లా కు చెందిన ఇద్దరు, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ అర్బన్ జిల్లా నుంచి ఒక్కొక్కరు ఉన్నట్టు చెప్పారు. 16 మందిని వివిధ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డు లో ఉంచామని వెల్లడించారు. వారి రిపోర్టులను సీసీఎంబీకి పంపారు. వారిలో యూకేలో గుర్తించిన కొత్త వైరస్ ఉందా? లేకపోతే కోవిడ్ 19 మాత్రమే ఉందా అనేది రిపోర్టులు వచ్చిన తర్వాత తెలుస్తుంది.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Coronavirus, Covid-19, UK Virus

  ఉత్తమ కథలు