హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

UK Corona Strain: హైదరాబాద్‌‌‌కి పాకిన యూకే కరోనా వైరస్ స్ట్రెయిన్, దేశంలో కొత్తగా 4 కేసులు

UK Corona Strain: హైదరాబాద్‌‌‌కి పాకిన యూకే కరోనా వైరస్ స్ట్రెయిన్, దేశంలో కొత్తగా 4 కేసులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హడలెత్తిస్తున్న కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ హైదరాబాద్‌కు కూడా పాకింది. దేశంలో తాజాగా నలుగురికి యూకేలో గుర్తించిన కరోనా వైరస్ స్ట్రెయిన్ సోకినట్టు భారత వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 29కి పెరిగింది.

ఇంకా చదవండి ...

  ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హడలెత్తిస్తున్న కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ హైదరాబాద్‌కు కూడా పాకింది. దేశంలో తాజాగా నలుగురికి యూకేలో గుర్తించిన కరోనా వైరస్ స్ట్రెయిన్ సోకినట్టు భారత వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 29కి పెరిగింది. తాజాగా నమోదైన కేసుల్లో మూడు కేసులు బెంగళూరులోనే ఉన్నాయి. ఇక మరో కేసు హైదరాబాద్‌లో నమోదైనట్టు తెలిసింది. ఇప్పటి వరకు భారత్‌లో నమోదైన యూకే కరోనా స్ట్రెయిన్ కేసుల్లో ఢిల్లీలో 10 శాంపిల్స్, బెంగళూరులో 10 శాంపిల్స్, హైదరాబాద్‌లో 3, పశ్చిమ బెంగాల్లో 1, పూణేలో మరో ఐదు శాంపిల్స్ టెస్ట్ చేస్తున్నారు. మొత్తం 29 మంది బాధితులను ఐసోలేషన్‌లో ఉంచారు. యూకే వైరస్ సాధారణం కంటే 70 శాతం వేగంగా విస్తరిస్తోందని వైద్యాధికారులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కొత్త వైరస్ కేసులు నమోదుకావడం ఆందోళన కలుగుతోంది.

  యూకేలో తొలిసారి కనిపించిన కరోనా వైరస్ స్ట్రెయిన్ ఆ తర్వాత చాలా దేశాలకు విస్తరించింది. ఇది ఇతరత్రా స్ట్రెయిన్‌ల కన్నా కూడా వేగంగా విస్తరిస్తోంది. ఈ కొత్త రకం వైరస్ డెన్మార్క్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, ఇటలీ, స్వీడన్, ఫ్రాన్స్, స్పెయిన్, స్విట్జర్లాండ్, జర్మనీ, కెనడా, జపాన్, లెబనాన్, సింగపూర్, భారత్ లాంటి దేశాలకు కూడా విస్తరించింది. 130 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత దేశంలో ఇలాంటి కరోనా మరింత వేగంగా విస్తరిస్తే ఎక్కువ మందికి సోకుతుందని ఆందోళన వ్యక్తం అవుతోంది.

  కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు కేంద్రం అనుమతి.. 

  సీరం ఇన్ స్టిట్యూట్ తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు కేంద్ర ప్రభుత్వ నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో దేశంలో తొలిసారిగా కరోనాకు ఈ వ్యాక్సిన్ వినియోగించనున్నారు. ఆక్స్‌ఫర్డ్ - అస్త్రాజెనికాతో కలసి సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ కోవిషీల్డ్‌ను అభివృద్ధి చేసింది. కేంద్ర ప్రభుత్వ నిపుణుల కమిటీ ఈ రోజు ఢిల్లీలో సమావేశమైంది. ఐదు గంటల పాటు చర్చించింది. కరోనాకు సంబంధించి ఏ వ్యాక్సిన్‌కు అనుమతి ఇవ్వాలనేదానిపై చర్చించింది. వ్యాక్సిన్‌ సామర్థ్యం, ఎంత సమర్థంగా పనిచేస్తుంది? ఇతరత్రా అంశాలను పరిశీలించి చివరకు కోవిషీల్డ్‌కు అనుమతి ఇచ్చింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒక్కో డోసు ధర భారత ప్రభుత్వానికి రూ.440కు అందిస్తుంది సీరం ఇన్‌స్టిట్యూట్. అదే, బహిరంగ మార్కెట్‌లో ఈ ధర రూ.700 నుంచి రూ.800 వరకు ఉండొచ్చని చెప్పింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లోనూ జనవరి 2 నుంచి డ్రైరన్ నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కరోనా వ్యాక్సిన్ కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు 80 కోట్ల సిరంజిలను ఆర్డర్ చేసింది.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Corona Vaccine, Coronavirus, Hyderabad, UK Virus

  ఉత్తమ కథలు