హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

UK Virus: యూకే నుంచి వచ్చిన రెండేళ్ల బాలికకు కొత్త రకం కరోనా వైరస్.. దేశంలో పెరుగుతున్న కేసులు

UK Virus: యూకే నుంచి వచ్చిన రెండేళ్ల బాలికకు కొత్త రకం కరోనా వైరస్.. దేశంలో పెరుగుతున్న కేసులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొత్త రకం కరోనా కేసుల సంఖ్య భారత్‌లో కూడా పెరుగుతోంది. ఇప్పటివరకు 20 మందికి కొత్త రకం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

  కొత్త రకం కరోనా కేసుల సంఖ్య భారత్‌లో కూడా పెరుగుతోంది. ఇప్పటివరకు 20 మందికి కొత్త రకం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అయితే ఓ రెండేళ్ల బాలికకు కూడా కొత్త రకం వైరస్ సోకడం ఆందోళన కలిగిస్తోంది. యూకే నుంచి వచ్చిన రెండేళ్ల చిన్నారికి కొత్తరకం కరోనా వైరస్ పాజిటివ్‌గా తెలినట్టు ఉత్తరప్రదేశ్‌లో మీరట్ వైద్య శాఖ అధికారులు వెల్లడించారు. ఆ బాలిక తల్లిదండ్రులకు పాత రకం కరోనా నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. వీరు యూకే నుంచి వచ్చినట్టు తెలిపారు. "యూకే నుంచి వచ్చిన ఆ కుటుంబంలోని నలుగురుకి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వారికి కొత్త రకం వైరస్ సోకిందో, లేదో నిర్ధారణ కోసం శాంపిల్స్‌ను ఢిల్లీకి పంపాం. అయితే వారిలో ఒక్క రెండేళ్ల బాలికకు మాత్రమే కొత్త రకం కరోనా వైరస్ నిర్దారణ అయింది" ని మీరట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ అఖిలేష్ మోహన్ తెలిపారు.

  ఆ బాలిక కుటుంబం టీపీ న‌గ‌ర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని సంత్ విహార్‌కు చెందిన వారిగా గుర్తించారు. దీంతో ఆ ప్రాంతానికి సీల్ వేసిన అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఆ బాలికను ఆమె తల్లిదండ్రులతో పాటు మీరట్‌లోని సుభర్తి మెడికల్ కాలేజ్‌లోని ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు. ఇక, భారత్‌లో కొత్త రకం వైరస్ నిర్ధారణ పరీక్షలను వేగవంతం చేయడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. దేశంలో కొత్త రకం కరోనా వైరస్‌ నిర్ధారణ కోసం 10 ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. వాటిలో ఇప్పటివరకు మొత్తం 107 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 20 మందికి కొత్త రకం కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

  బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్ కేసులు వెలుగుచూడటంతో.. భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.‌ అక్కడి నుంచి విమాన ప్రయాణాలపై నిషేధం విధించింది. నిషేధం కంటే నెల రోజుల ముందుగా యూకే నుంచి ఇండియాకు చేరుకున్న వారిని గుర్తించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఇక, నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 మధ్య బ్రిటన్ నుంచి భారత్‌కు తిరిగొచ్చినట్లు కేంద్రం తెలిపింది. ఇక, కొత్త రకం కరోనా వైరస్.. పాత కరోనా వైరస్ కన్నా 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Coronavirus, UK Virus, Uttar pradesh

  ఉత్తమ కథలు