సౌతాఫ్రికా వెలుపల బ్రిటన్ ఒమిక్రాన్ హాట్ స్పాట్ గా మారుతోందా? అనే అనుమానాలను మరింత పెంచుతూ అక్కడ కొత్త కేసులు వెల్లువలా వస్తున్నాయి. యూకేలో శనివారం రాత్రి వరకు మొత్తం 160 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి సాజిద్ జావిద్ ప్రకటించారు. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో విమాన ప్రయాణాలపై యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (UKHSA) మరిన్ని ఆంక్షలు విధించింది..
కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభణ మొదలైనట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. కొవిడ్ సెకండ్ వేవ్ లో లక్షల మందిని పొట్టనపెట్టుకున్న డెల్టా వేరియంట్ కంటే ఐదు రెట్లు ప్రమాదకారిగా భావిస్తోన్న ఒమిక్రాన్ వ్యాప్తి పెరిగితే ప్రపంచ దేశాలకు ఇబ్బందు తప్పవని డబ్ల్యూహెచ్ఓ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది. ఆదివారం నాటికి ఒమిక్రాన్ వేరియంట్ దాదాపు 34 దేశాలకు విస్తరించింది. సౌతాఫ్రికా వెలుపల బ్రిటన్ ఒమిక్రాన్ హాట్ స్పాట్ గా మారుతోందా? అనే అనుమానాలను మరింత పెంచుతూ అక్కడ కొత్త కేసులు వెల్లువలా వస్తున్నాయి. యూకేలో శనివారం రాత్రి వరకు మొత్తం 160 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి సాజిద్ జావిద్ ప్రకటించారు. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో విమాన ప్రయాణాలపై మరిన్ని ఆంక్షలు విధిస్తూ యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (UKHSA) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను పలు ఎయిర్ లైన్స్ సంస్థలు, పైలట్ల అసోసియేషన్లు వ్యతిరేకిస్తున్నాయి. వివరాలివి..
బ్రిటన్ లో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. శనివారం రాత్రి వరకు ఆ దేశంలో మొత్తం 160 కేసులు నమోదయ్యాయి. కాగా, వీటిలో అత్యధికంగా నైజీరియా, సౌతాఫ్రికాల నుంచి వచ్చినవారే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై యూకే నిబంధనలను మరింత కఠినతరం చేసింది. నైజీరియాను సైతం రెడ్ లిస్టులో చేర్చింది. సౌతాఫ్రికా సహా తొమ్మిది సౌతాఫ్రికా దేశాలు, ఇప్పుడు నైజీరియా నుంచి బ్రిటిష్ జాతీయులు లేదా యూకీలో స్థిర నివాసం ఉన్నవాళ్లను తప్ప ఆయా దేశాల పౌరులను యూకేలోకి అనుమతించరు. అదే సమయంలో ఎక్కడి నుంచైనా బ్రిటన్ లోకి అడుగుపెడితే.. కచ్చితంగా కొవిడ్ టెస్టులు చేయించుకోవాల్సిందేనని, అనుమానితులు క్వారంటైన్ లో ఉండాల్సిందేనని యూకే ఆంక్షలు విధించింది.
ప్రయాణికులకు పీసీఆర్ టెస్టు గానీ ప్రయాణానికి 48 గంటల ముందు చేయించుకున్న ర్యాపిడ్ టెస్టుగానీ తప్పనిచేసే నిబంధన మంగళవారం నుంచి అమలులోకి రానుంది. అయితే ఈ నిర్ణయాన్ని ఎయిర్ లైన్స్ సంస్థలు, పైలట్ అసోసియేషన్లు వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వ చర్యలు ప్యాసింజర్లను నిరుత్సాహపర్చేలా ఉన్నాయని, ఇదే కొనసాగితే విమానయానరంగం ఇబ్బందులకు గురికాక తప్పదని వారు అంటున్నారు.
కాగా, యూకేలో నమోదవుతోన్న ఒమిక్రాన్ కేసుల్లో ఎక్కువగా ప్రయాణికుల నుంచే వస్తున్న క్రమంలో ఆ వేరియంట్ వ్యాప్తిని నిలువరించడానికి ప్రయాణాలపై ఆంక్షలు తప్పవని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ స్పష్టం చేశారు. కట్టడి చర్యలు తీసుకుంటూనే మరోవైపు, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఒమిక్రాన్‌పై ఎంతవరకు ప్రభావం చూపుతాయనే పరిశోధనలను శాస్త్రవేత్తలు చేపట్టారని ప్రధాని తెలిపారు. ఒమిక్రాన్ పరిస్థితులకు సంబంధించిన వ్యవహారాలను మళ్లీ డిసెంబర్ 20న రివ్యూ చేస్తామని ఆయన పేర్కొన్నారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.