యూకేలో 10,000 దాటిన కరోనా మరణాలు... ప్రధాని డిశ్చార్జ్...

యూకేలో 10,000 దాటిన కరోనా మరణాలు... ప్రధాని డిశ్చార్జ్...

నిన్నటి వరకు మొత్తం 7,70,764 టెస్టులు చేశారు.

యునైటెడ్ కింగ్‌డమ్‌లో కరోనా పాజిటివ్‌తో చనిపోయిన వారి సంఖ్య 10,000 దాటింది.

  • Share this:
    యునైటెడ్ కింగ్‌డమ్‌లో కరోనా పాజిటివ్‌తో చనిపోయిన వారి సంఖ్య 10,000 దాటింది. ఈ విషయాన్ని అక్కడి ఆరోగ్య శాఖ ప్రకటించినట్టు వార్తా సంస్థ ఏఎఫ్‌సీ ప్రకటించింది. ఇప్పటి వరకు యునైటెడ్ కింగ్‌డమ్‌లో 10,610 కరోనా మరణాలు నమోదయ్యాయి. మరో వైపు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్నారు. ఆయన కరోనా వైరస్‌ మహమ్మారి బారిన పడి ఆస్పత్రిలో చేరారు. తొలుత కరోనా లక్షణాలు కనిపించడంతో మార్చి 26 నుంచి ఆయన స్వీయ నిర్బంధంలో ఉంటూ చికిత్స తీసుకున్నారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోవడంతో వైద్యుల సూచన మేరకు ఏప్రిల్‌ 5న హాస్పిటల్‌కు వెళ్లారు. వ్యాధి తీవ్రత పెరగడంతో ఆయన్ను ఐసీయూకి తరలించి చికిత్స అందించారు. చికిత్స తర్వాత ఈ రోజు కోలుకున్నారు. యూకేలో 84వేల కరోనా పాజిటివ్ కేసులు ఉండగా, అందులో 10,600 మందికి పైగా చనిపోయారు. పదివేల కరోనా మరణాలు నమోదైన ఐదో దేశంగా (అమెరికా, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్‌ తర్వాత) యూకే నిలిచింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు