HOME »NEWS »Corona vilayatandavam »uk becomes first nation to approve pfizer biontech vaccine for use will be available next week sk

Pfizer Vaccine: ఫైజర్ వాక్సిన్‌కు ఆమోదం.. వచ్చేవారం నుంచే అక్కడ టీకాలు

Pfizer Vaccine: ఫైజర్ వాక్సిన్‌కు ఆమోదం.. వచ్చేవారం నుంచే అక్కడ టీకాలు
ప్రతీకాత్మక చిత్రం

Pfizer Vaccine: ఫైజర్ వాక్సిన్‌ను ఆమోదించిన తొలి దేశం బ్రిటన్ కావడం విశేషం. ఇప్పటికే 4 కోట్ల ఫైజర్ టీకా డోసులకు యూకే ప్రభుత్వం ఆర్డర్ చేసింది. ఇది 2 కోట్ల మందికి సరిపోతాయి.

  • Share this:
    కరోనా వాక్సిన్ ఎప్పుడు వస్తుందా? అని యావత్ ప్రపంచం ఎదురుచూస్తున్న వేళ బ్రిటన్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సీన్‌ వినియోగానికి ఆమోదం తెలిపింది. ప్రపంచంలో ఫైజర్ ( Pfizer-BioNTech) వ్యాక్సీన్‌ను వచ్చే వారం నుంచే ఈ వ్యాక్సీన్ పంపిణీకి అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే వారం నుంచి ప్రజలందరికీ వాక్సిన్ అందుబాటులోకి రానుంది. కరోనా మహమ్మారి నుంచి ఫైజర్ వాక్సిన్ 95శాతం రక్షణ కల్పిస్తుందని, ఇది సురక్షితమైనదని బ్రిటర్ ప్రభుత్వం వెల్లడించింది. మూడు వారాల వ్యవధిలో ఒక్కొక్కరికి రెండు డోసుల టీకాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఫైజర్ వాక్సిన్‌ను ఆమోదించిన తొలి దేశం బ్రిటన్ కావడం విశేషం.




    ''హెల్త్ కేర్ ఉత్పత్తుల రెగ్యులేటరీ సంస్థ MHRA ప్రతిపాదనల మేరకు ఫైజర్ బయోఎన్‌టెక్ వాక్సిన్ వినియోగానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వచ్చే వారం నుంచే యూకే వ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమవుతుంది.'' అని బ్రిటన్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. మొదట డాక్టర్లు, ఇతర ఆరోగ్య సిబ్బంది, వృద్ధులకు టీకా అందజేయనున్నారు. యూకేలో ఎమర్జెన్సీ వినియోగానికి ఫైజర్‌ వాక్సిన్‌ను ఆమోదించడం చారిత్రాత్మకమని ఫైజర్ సీఈవో ఆల్బర్ట్ బోర్లా తెలిపారు.

    ఇప్పటికే 4 కోట్ల ఫైజర్ టీకా డోసులకు బ్రిటన్ ప్రభుత్వం ఆర్డర్ చేసింది. ఇది 2 కోట్ల మందికి సరిపోతాయి. మరో కోటి డోసులు త్వరంలోనే అందుబాటులోకి వస్తాయని అక్కడి ప్రభుత్వం తెలిపింది. సాధారణంగా వాక్సిన్ తయారు చేయడానికి ఏళ్ల సమయం పడుతుంది. ఒక్కోసారి పదేళ్ల వరకు పరిశోధనలు జరుగుతాయి. కానీ ఫైజర్ వాక్సిన్ మాత్ంర 10 నెలల్లోనే తయారు చేసి అందుబాటులోకి తెస్తున్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా తయారైన వాక్సిన్ కూడా ఫైజర్-బయోఎన్‌టెక్ కావడం విశేషం. ఈ వాక్సిన్‌ను అమెరికాకు చెందిన ఫైజర్, జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ కంపెనీలు సంయుక్తంగా అభివృద్ది చేశాయి.

    ఫైజర్ వ్యాక్సీన్‌ను మూడు వారాల్లో రెండు డోసులు తీసుకోవాలి. అమెరికా, బ్రెజిల్, జర్మనీ, అర్జెంటీనా, దక్షిణాఫ్రికా, టర్కీలో క్లినికల్ ట్రయల్స్‌ నిర్వహించారు. 90శాతం మంద వాలంటీర్లలో ఏడు రోజుల్లోనే కరోనాను ఎదుర్కొనేందుకు యాంటీ బాడీలు తయారయ్యాయి. రోగ నిరోధక వ్యవస్థ మెరుగపడింది. ఐతే ఈ వ్యాక్సీన్‌ను మైనస్ 80 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫైజర్‌ వాక్సిన్‌ను భద్రపరచడం ఇబ్బందిగా మారుతోంది.
    Published by:Shiva Kumar Addula
    First published:December 02, 2020, 13:37 IST