మద్యం దొరక్కపోవడంతో కూల్ డ్రింక్‌లో షేవింగ్ లోషన్ కలుపుకుని..

కరెంట్ బిల్లు టెన్షన్ కారణంగా అతిగా మద్యం సేవించిన లక్ష్మణ్.. ఆ మత్తులోనే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. బాధితుడి చనిపోయిన స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..విచారణ చేపట్టారు.

లాక్‌డౌన్ నేపథ్యంలో మద్యం దొరకడం లేదు. దీంతో మత్తుకు అలవాటైన ఓ ముగ్గురు యువకులు కూల్ డ్రింక్‌లో షేవింగ్ లోషన్ కలుపుకుని తాగేశారు. దీంతో ఇద్దరు యువకులు మ‌ృతిచెందగా, మరోక యువకుడు ఆస్పత్రిలో ప్రాణాప్రాయ స్థితిలో ఉన్నాడు.

  • Share this:
    కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. దీంతో అత్యవసర సేవలు మినహా సర్వం బందయ్యాయి. ఈ నేపథ్యంలో మత్తుకు బానిసైన మందుబాబులు రోజురోజూకీ చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. మద్యం దొరక్క ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. తాజాగా తమిళనాడులో మద్యం దొరక్కపోవడంతో కూల్ డ్రింక్‌లో షేవింగ్ లోషన్ కలుపుకుని ముగ్గురు యువకులు తాగారు. ఇందులో ఇద్దరు యువకులు మరణించగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కొట్టైపట్టినమ్‌కు చెందిన ముగ్గురు మృత్స్యకార యువకులు ఎం.హసన్ మైదీన్(35), పి.అన్వర్ రాజా(33), ఎం.అరుణ్ కుంతియాన్(29)లు రోజూ మందు తాగేవారు.

    లాక్‌డౌన్ కారణంగా మద్యం దుకాణాలు, బార్లు మూసేయడంతో వారికి మద్యం లభించలేదు. కూల్ డ్రింక్‌లో షేవింగ్ లోషన్ కలుపుకుని తాగితే మత్తు ఎక్కుతుందని ఎవరో చెప్పారు. దీంతో మత్తు కోసం ఏం చేయాలో తెలియక.. శుక్రవారం రాత్రి ముగ్గురు కూల్ డ్రింక్‌లో షేవింగ్ లోషన్ కలుపుని తాగారు. తర్వాత ఎవరింటికి వారు వెళ్లిపోయారు. కొద్దిసేపటికే మైదీన్, అరుణ్ వాంతులు చేసుకుంటుండడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. వారిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించారు. అదే క్రమంలో అస్వస్థతకు గురైన అన్వర్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. అన్వర్ పరిస్థితి సైతం విషమంగా ఉందని తెలుస్తోంది. ఇదిలావుంటే.. నాలుగు రోజుల క్రితం కేరళలోనూ ఓ వ్యక్తి ఇదే తరహాలో కూల్ డ్రింక్‌లో షేవింగ్ లోషన్ కలుపుకుని తాగడంతో మృతిచెందాడు.
    Published by:Narsimha Badhini
    First published: