మాస్కు ధరించకుండా విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్.. నెట్టింట ఫొటో వైరల్.. రూ.2వేల జరిమానా..

మాస్కు ధరించకుండా విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్.. నెట్టింట ఫొటో వైరల్.. రూ.2వేల జరిమానా..

ప్రతీకాత్మక చిత్రం

విధి నిర్వహణలో ఉన్న ఓ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ కు రెండు వేల రూపాయల జరిమానా విధించిన ఘటన నెట్టింట వైరల్ అవుతోంది. మాస్కు పెట్టుకోకుండా విధులు నిర్వహిస్తున్నాడన్న కారణంతోనే అతడికి జరిమానా విధించారు.

 • Share this:
  కరోనా సెకండ్ వేవ్ పెద్ద కల్లోలాన్నే సృష్టిస్తోంది. రూపం మార్చుకుని వస్తున్న మహమ్మారి పట్ల ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వ్యాక్సిన్ వచ్చిందనీ, ఇక భయం లేదనుకున్న ప్రజల్లో మళ్లీ ఆందోళన వ్యక్తమవుతోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరిగి పోతుండటం, మృతుల సంఖ్య కూడా అదే స్థాయిలో ఉండటంతో ప్రభుత్వాలు కూడా నష్ట నివారణ చర్యలు చేపడుతున్నారు. గతేడాది పాటించిన నిబంధనలను మళ్లీ అమలుచేస్తూ వస్తున్నారు. ప్రతీ ఒక్కరు మాస్కు ధరించాలనీ, సామాజిక దూరం పాటించాలని స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నా మెజారిటీ ప్రజలు ఇంకా నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో ప్రభుత్వాలు జరిమానాల దిశగా అడుగులు వేస్తోంది. అయితే జరిమానాలు అన్నీ సామాన్య ప్రజలకే ఉంటాయనీ, అధికారులు, పోలీసులకు ఉండవని అంతా అనుకుంటుంటారు. కానీ ఓ చోట మాత్రం ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది.

  మాస్కు ధరించకపోతే రెండు వేల రూపాయల జరిమానా విధిస్తామంటూ ఒడిశా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాలను అమలు చేసే బాధ్యత పోలీసులపై ఆ రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. అయితే తాజాగా విధి నిర్వహణలో ఉన్న ఓ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ కు రెండు వేల రూపాయల జరిమానా విధించిన ఘటన నెట్టింట వైరల్ అవుతోంది. మాస్కు పెట్టుకోకుండా విధులు నిర్వహిస్తున్నాడన్న కారణంతోనే అతడికి జరిమానా విధించారు. ఆయన మాస్కు ధరించకుండా విధులు నిర్వహిస్తున్న ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అయింది. దీంతో అధికారులు స్పందించి అతడికి జరిమానా విధించారు.
  ఇది కూడా చదవండి: భర్త దారుణ హత్య.. పర్సు తీసుకొస్తానని పోలీసులకు చెప్పి ఇంట్లోకి వెళ్లిన భార్య.. ఎంతకూ తిరిగి రాకపోవడంతో వెళ్లి చూస్తే..

  ఈ ఘటన గురించి పురీ ఎస్పీ కన్వర్ విషాల్ సింగ్ మాట్లాడారు. ‘సామాజిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం ఒక్కటే మనముందున్న ప్రత్యామ్నాయ మార్గాలు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాల్సిందే. మాకు అందిన సమాచారం మేరకు మా సొంత కానిస్టేబుల్ పైనే జరిమానా విధించాం. ప్రతీ ఒక్కరూ సమానమే‘ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
  ఇది కూడా చదవండి: ఓ ఇంటి ముందు టెంటు వేసి.. కుర్చీలో కూర్చుని కూలింగ్ వాటర్ తాగుతూ నిరసన.. ఇంతకీ అసలేం జరిగిందో తెలిస్తే అవాక్కవడం ఖాయం..!
  Published by:Hasaan Kandula
  First published:

  అగ్ర కథనాలు