BSFలో కరోనా కలకలం.. హెడ్‌ఆఫీస్‌లో రెండు ఫ్లోర్స్ మూసివేత

RPFలో 135 మంది సిబ్బంది కరోనా బారినపడ్డారు. వీరిలో మెజారిటీ సిబ్బంది ఢిల్లీ కేంద్రంగా పనిచేసే బెటాలియన్‌లోనే ఉన్నారు. బాధితుల్లో ఇప్పటికే ఒకరు మరణించారు.

news18-telugu
Updated: May 4, 2020, 3:27 PM IST
BSFలో కరోనా కలకలం.. హెడ్‌ఆఫీస్‌లో రెండు ఫ్లోర్స్ మూసివేత
ప్రతీకాత్మక చిత్రం (image: BSF)
  • Share this:
దేశంలో విలయ తాండవం చేస్తున్న కరోనా వైరస్.. భద్రతా దళాలకూ పాకింది. ఇప్పటికే CRPF, ITBP దళాల్లో పలువురికి కరోనావైరస్ సోకగా.. తాజాగా BSF హెడ్ క్వార్టర్స్‌లో తీవ్ర కలకలం రేపింది. ఢిల్లీలోని బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆదివారం రాత్రి ఈ విషయం తెలియడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రధాన కార్యాయలంలోని ఒకటి, రెండతస్తులను పూర్తిగా మూసివేశారు. సదరు బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ చివరిగా మే 1న విధులకు హాజరైనట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో రెండు అంతస్తులను మూసివేసి శానిటైజ్ చేస్తున్నారు. అక్కడ పనిచేసే 42 మంది సిబ్బందిని క్వారంటైన్ చేశారు. ఆయనతో దగ్గరగా మెలిగిన వారి వివరాలను సేకరిస్తున్నారు.

BSFలో ఇప్పటి వరకు 56 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఢిల్లీలోనే ఎక్కువ మంది బాధితులు ఉన్నారు. అటు CRPFలో 135 మంది సిబ్బంది కరోనా బారినపడ్డారు. వీరిలో మెజారిటీ సిబ్బంది ఢిల్లీ కేంద్రంగా పనిచేసే బెటాలియన్‌లోనే ఉన్నారు. బాధితుల్లో ఇప్పటికే ఒకరు మరణించారు. అటు ITBPలోనూ 21 మంది కరోనా బారినపడ్డారు. సాయుధ బలగాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కరోనా నివారణ కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది.

ఇక కేంద్రం ఆరోగ్య కుటుంబసంక్షేమశాఖ లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,270 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 67 మంది చనిపోయారు. దాంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 42,533 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరీలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 11,707 మంది కోలుకోగా.. 1,373 మంది చనిపోయారు. ప్రస్తుతం భారత్‌లో 29,453 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
Published by: Shiva Kumar Addula
First published: May 4, 2020, 3:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading