Home /News /coronavirus-latest-news /

TTD SET NEW GUIDELINES FOR DEVOTEES WHO CAME TO VISIT TIRUMALA MUST FALLOW NGS

corona effect on tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: నిబంధనల్లో మార్పులు చేసిన టీటీడీ? దర్శనానికి వెళ్లాలి అంటే ఇవి తెలుసుకోవాల్సిందే

తిరుమలలో ఆంక్షలు కఠినం

తిరుమలలో ఆంక్షలు కఠినం

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలి అనుకునే భక్తులు ఇకపై ఈ నిబంధనలు పాటించాల్సిందే. కరోనా కేసులు రోజు రోజుకూ మళ్లీ పెరుగుతుండడంతో కఠిన ఆంక్షలపై ఫోకస్ చేసింది టీటీడీ. నిబంధనలు పాటించిన వారికే మాత్రమే దర్శనానికి అనుమతించనున్నారు. ఇంతకీ ఏంటి ఆ నిబంధనలు.

ఇంకా చదవండి ...
    తిరుమల తిరుపతి (tirumala tirupathi devasthanam) దర్శనానికి వెళ్దామనుకుంటున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి? కచ్చితంగా ఈ నిబంధనల గురించి తెలుసుకోవాల్సిందే. లేదంటే దర్శనానికి అనుమతి లేకుండా అక్కడే పడిగాపులు పడాల్సి వస్తుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా (corona) విస్తరిస్తోంది. మఖ్యంగా  ఆంధ్రప్రదేశ్లోనూ (andhra pradesh) వైరస్ పంజా విసురుతూనే ఉంది. ప్రతి రోజు దాదాపు వేయికి అటు ఇటుగా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. గతంతో పోల్చుకుంటే కరోనా కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి. తగ్గినట్టే తగ్గిన కేసులు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో టీటీడీ (ttd) మరోసారి అలర్ట్ అయ్యింది. నిబంధనలు కఠినం చేసింది.

    ముఖ్యంగా చిత్తూరు (chittoor) జిల్లాలో పరిస్థితి ఆందోళన పెంచుతోంది. రాష్ట్రంలో అత్యధిక కేసులు నమోదు అవుతున్న జిల్లాల్లో చిత్తూరు కచ్చితంగా ఉంటోంది. ప్రతి రోజూ దాదాపు 200లకు చేరువలో కేసులు పెరుగుతున్నాయి. అత్యంత వేగంగా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే అక్కడి అధికారులు కరోనా కంట్రోల్ పై ప్రత్యేక ఫోకస్ చేశారు. అధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో కరోనాను కట్టడి చేసేందుకు జిల్లా యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. రేపటి నుంచి సంపూర్ణ ఆంక్షలు విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

    శ్రీవారి దర్శనం టికెట్లు ఉన్నవారికే మాత్రమే ఇకపై తిరుమలకు అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. అలాగే నడకదారి భక్తులకు ముందు రోజు ఉదయం 9 గంటల నుంచి అనుమతి ఉంటుందని తెలిపారు. వాహనాల్లో వచ్చేవారికి ముందు రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. అయితే ఆంక్షలు ఇక్కడికే పరిమితం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగితే నిబంధనలు మరింత కఠినం చేసే అవకాశాలు లేకపోలేదు. భక్తుల్లో ఎవరికైనా కరోనా నిర్ధారణ అయితే.. అప్పటి పాజిటివ్‌ కేసుల సంఖ్యను బట్టి లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలను కుదించాలా, మరి కొద్ది రోజులు ఆంక్షలు పొడిగించాలా అన్న నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

    ఏపీ వ్యాప్తంగా నాలుగు జిల్లాల్లోనే అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. అందులో చిత్తూరు కూడా ఉండడంతో తిరుమలలో కఠిన ఆంక్షలు అమలు చేయకతప్పడం లేదంటున్నారు అధికారులు. గతంలో లాక్ డౌన్ కారణంగా ఆలయాన్ని మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్లీ పరిస్థితి ఆందోళన పెంచుతోంది. ఇప్పుడుప్పుడే భక్తులు స్వామి దర్శనానికి భారీగా వస్తున్నారు. ఇలాంటి సమయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చే ప్రమాదం ఉందని అధికారులు భయపడుతున్నారు. మరోవైపు, చిత్తూరు జిల్లాలో క‌రోనా వైరస్‌ తీవ్రత అధిక‌మ‌వుతున్నందున ప్రతి ఒక్కరూ నిబంధ‌న‌లు పాటించాల‌ని కలెక్టర్ (chitoor collector) కోరారు. ప్రతీ ఒక్కరూ విధిగా నిబంధ‌న‌లను పాటించి స‌హ‌క‌రించాల‌ని పోలీసులు తెలిపారు.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Tirumala, Tirumala tirupati devasthanam, Tirupati, Ttd

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు