హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

కరోనాతో శ్రీనివాసాచార్యులు మృతి.. టీటీడీ అర్చకుల్లో ఆందోళన

కరోనాతో శ్రీనివాసాచార్యులు మృతి.. టీటీడీ అర్చకుల్లో ఆందోళన

అర్చకుడు శ్రీనివాసాచార్యులు(ఫైల్ ఫోటో)

అర్చకుడు శ్రీనివాసాచార్యులు(ఫైల్ ఫోటో)

అర్చకుడు శ్రీనివాసాచార్యులు చనిపోయారనే విషయం తెలిసిన వెంటనే పలువురు అర్చకులు గోవింద నిలయంలో సమావేశమయ్యారు.

    కరోనా కారణంగా టీటీడీ అర్చకుడు శ్రీనివాసాచార్యులు కన్నుమూయడంతో అర్చకుల్లో ఆందోళన మొదలైంది. విధులు నిర్వహించేందుకు అర్చకుల్లో చాలామంది భయపడుతున్నట్టు తెలుస్తోంది. శ్రీనివాసాచార్యులు చనిపోయారనే విషయం తెలిసిన వెంటనే పలువురు అర్చకులు గోవింద నిలయంలో సమావేశమయ్యారు. శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రితో అర్చకుల చర్చలు జరిపారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో కళ్యాణోత్సవ సేవను ఈ నెల 31వరకు నిలిపి వేయాలని అర్చకుల ఆయనకు సూచించినట్టు తెలుస్తోంది. వాహన బేరర్ల ద్వారా కరోనా సోకుతుందని అర్చకులు భయపడుతున్నట్టు సమాచారం. తమ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని అర్చకులు రేపు ఈవో, అడిషనల్ ఈవోలకు వినతిపత్రం ఇవ్వనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక టీటీడీ అర్చకుల్లో ఇప్పటికే అఅనేక మందికి కరోనా సోకింది. వారిలో కొందరి పరిస్థితి విషమించడంతో... వారికి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ప్రస్తుతం వారంతా కోలుకున్నారు. అయితే ఈ రోజు అర్చకుడు శ్రీనివాసాచార్యులు చనిపోవడం వారిలో ఆందోళన పెంచింది.

    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Tirumala news, Ttd

    ఉత్తమ కథలు