హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

తిరుమలలో విషాదం.. కరోనాతో టీటీడీ అర్చకుడి మృతి

తిరుమలలో విషాదం.. కరోనాతో టీటీడీ అర్చకుడి మృతి

తిరుమల శ్రీవారి ఆలయం

తిరుమల శ్రీవారి ఆలయం

కరోనాతో టీటీడీ అర్చకుడు ఎన్వీ శ్రీనివాసాచార్యలు చనిపోయారు.

  ఏపీలో అనేక మందిని కబళిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా టీటీడీ అర్చకుడు కన్నుమూశారు. కరోనాతో టీటీడీ అర్చకుడు ఎన్వీ శ్రీనివాసాచార్యలు చనిపోయారు. శ్రీనివాసాచార్యులు వయసు 45 సంవత్సరాలు. గోవిందరాజులస్వామి ఆలయం నుంచి శ్రీనివాసాచార్యులు తిరుమలకు డిప్యూటేషన్‌పై వెళ్లినట్టు తెలుస్తోంది. కరోనా సోకడంలో వారం క్రితం స్విమ్స్ ఆస్పత్రిలో చేరిన శ్రీనివాసాచార్యులు.. అక్కడే చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొద్దిరోజులుగా శ్రీనివాసాచార్యులు శ్రీవారి ఆలయంలో విధులు నిర్వహిస్తున్నారు. కాగా, అర్చకుడు శ్రీనివాసాచార్యుల మృతిని టీటీడీ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.

  తిరుమలలో కొద్దిరోజుల క్రితం సిబ్బందితో పాటు అర్చకులు కూడా కరోనా బారిన పడ్డారు. శ్రీవారి దర్శనాలు పునఃప్రారంభించిన తర్వాత టీటీడీలో కూడా కరోనా కలకలం మొదలైంది. 100కి పైగా సిబ్బందికి కరోనా సోకింది. 17 మంది శ్రీవారి అర్చకులకు సైతం కరోనా పాజిటివ్ వచ్చింది. వారిలో అనేక మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. వైద్యులు వారిని క్వారంటైన్ కేంద్రం నుంచి డిశ్చార్జి చేశారు. కరోనా బారిన పడిన ఆలయ పెద్ద జియ్యంగార్ కూడా కరోనా నుంచి కోలుకున్నారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Coronavirus, Tirumala news, Ttd

  ఉత్తమ కథలు