హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Corona Effect: తిరుమల శ్రీవారి ఆలయంలో విషాదం. కరోనా కారణంగా ప్రధాన అర్చకులు కన్నుమూత

Corona Effect: తిరుమల శ్రీవారి ఆలయంలో విషాదం. కరోనా కారణంగా ప్రధాన అర్చకులు కన్నుమూత

తిరుమల

తిరుమల

తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వైరస్ వెంటాడుతోంది. ఇప్పటికే కరోనా ఎఫెక్ట్ కారణంగా కఠిన ఆంక్షల మధ్య కొద్ది మందికే దర్శన అవకాశం లభిస్తోంది. తాజాగా ఆలయ ప్రధాన అర్చకులు కరోనాకు చికిత్స పొందుతూ తుది శ్వాస విడవం కలకలం రేపుతోంది.

  కలియుగ వైకుంఠంగా చెప్పుకునే తిరుమల తిరుపతిపై కరోనా పంజా విసిరింది. పెను విషాదం నిపింది.  తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు నారాయణ దీక్షితులు కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన కరోనా కరాణంగా  చికిత్స పొందుతున్నారు. కరోనాకు చికిత్స తీసుకుంటూనే ఆయన తుది శ్వాస విడిచారు.  నెల రోజుల కిందటే ఆయన్ను ఆలయ ప్రధాన అర్చకులుగా ఏపీ ప్రభుత్వం నియమించింది. మళ్లీ పదవి వచ్చింది అన్న సంతోషం లేకుండా కరోనా కాటు వేసింది.

  ముఖ్యంగా తిరుమల తిరుపతిపై కరోనా ఎఫెక్ట్ భారీగా పడింది. కరోనా వేగంగా విస్తరిస్తుండడంతో దర్శనాల సంఖ్యను కుదిరించారు. కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. దీంతో ఏప్రిల్ నెలలో భక్తుల సంఖ్యతో పాటు, ఆధాయం భారీగా తగ్గింది.  ఏప్రిల్ నెల మొత్తం కలిపి కేవలం  9.05 మంది మాత్రమే  శ్రీవారిని దర్శించుకున్నట్టు అధికారులు ప్రకటించారు.  అలాగే హుండీ ఆదాయం 62 కోట్ల 62 లక్షల రూపాయలు వచ్చిందన్నారు.  4.61 లక్షలమంది తల నీలాలు సమర్పించుకున్నారు.  అంటే మార్చి నెలతో పోలిస్తే ఆదాయం సగానాకి సగం పడిపోయింది.  మార్చి నెలల్లో 16.27 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటే..  హుండీ ఆదాయం 104 కోట్ల రూపాయల పైనే వచ్చింది. అది కూడా మార్చిలోనే కఠిన ఆంక్షల మధ్యే దర్శనాలు కొనసాగాయి. సాధారణ సమయాల్లో అయితే నాలుగు రెట్ల ఆదాయం ఎక్కువంగా వస్తుంటుంది.

  తాజా పరిణామంతో తిరుమలలో ఆంక్షలను మరింత కఠినంగా చేసే అవకాశం  ఉంది. మరోవైపు తిరుమలలో భారీగా కేసులు పెరుగుతుండడంతో మరోసారి ఆలయాన్ని పూర్తిగా మూసివేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. సాధరణంగా ఏపీ వ్యాప్తంగా చూస్తే.. చిత్తూరు జిల్లాల్లోనే అధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. ప్రతి రోజూ క్రమం తప్పకుండా 1500లకు పైగా మంది కరోనా బారిన పడుతున్నారు. అయితే అందులో సగానికి పైగా కేసులో తిరుపతిలోనే నమోదు అవుతున్నవి.. అయితే అవన్నీ తిరుమల కారణంగా నమోదవుతున్న కేసులే అని  స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీగా కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో మరోసారి ఆలయాన్ని మూసేయాలనేే డిమాండ్ ఊపందుకుంది. తాజా మరణంతో ఆ ఆందోళనలు మరింత అధికమయ్యే అవకాశం ఉంది.

  టీటీడీ చైర్మన్ మాత్రం ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పదే పదే చెబున్నారు. కరోనా కట్టడి కోసం టీటీడీ పాలకమండలి అనుక్షణం పరితపిస్తోంది అంటున్నారు. కరోనా నిబంధనలను పాటిస్తూనే.. ఎవరికీ ఇబ్బంది లేకుండా భక్తులను అనుమతిస్తున్నామన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భక్తులు కూడా అన్నిరకాలకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. ఎవరికీ ఎలాంటి లక్షాలు ఉన్నా తిరుమలవైపు రావొద్దని సూచిస్తున్నారు. థర్మల్ స్క్రీనింగ్ చేసిన తరువాత అనుమతి ఉన్నవారిని మాత్రమే దర్శనానికి పంపిస్తున్నామంటున్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Corona patient, Tirumala, Tirumala news, Tirumala Temple, Tirumala tirupati devasthanam

  ఉత్తమ కథలు