Home /News /coronavirus-latest-news /

TTD EMPLOYEES FEARING OF CORONAVIRUS SECOND WAVE AS SOME OF THEM DEAD AK

Tirumala: టీటీడీ ఉద్యోగులను కలవరపెడుతున్న కరోనా మహమ్మారి.. రెండు వారాల్లో..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Tirupati: తిరుపతిలో కోవిడ్‌ మరణాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో టిటిడి ఉద్యోగుల కుటుంబాల రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.

    దేశం మొత్తాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి టీటీడీ ఉద్యోగులను కూడా టెన్షన్ పెడుతోంది. గత రెండు వారాల్లో 8 మందికి పైగా ఉద్యోగులు కరోనా కారణంగా చనిపోయారు. గతేడాది కరోనా ఫస్ట్‌ వేవ్‌లో 805 మందికి కరోనా రాగా నలుగురు మృతిచెందారు. సెకండ్‌ వేవ్‌లో 184 మందికి కరోనా రాగా 8 మంది చనిపోయారు. అయితే మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉందని.. బుధవారం ఒక్కరోజే ముగ్గురు మృతిచెందారని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కరోనా తీవ్రత పెరుగుతుండటంతో.. ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని టీటీడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే ఆసక్తి నెలకొంది.

    ఉద్యోగ సంఘాలు కోరినట్టు 50:50 విధానం ప్రవేశపెడతారా, లేక ఇతర విధానాలు చేపడతారా అని పలువురు ఎదురుచూస్తున్నారు. తిరుపతిలో గత ఏడాది కేసులు సంఖ్య తక్కువగా ఉన్న సమయంలోనే లాక్‌ డౌన్‌ ప్రకటించారు. అయితే ఇప్పుడు కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు తిరుపతిలో కోవిడ్‌ మరణాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో టిటిడి ఉద్యోగుల కుటుంబాల రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Coronavirus, Tirumala

    తదుపరి వార్తలు