AP Corona: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి కరోనా.. వారందరిలో టెన్షన్.. టెన్షన్

టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి(ఫైల్ ఫోటో)

AP Corona: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కరోనా బారిన పడ్డారు. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హాస్పటల్ లో ఆయన చేరి చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.

  • Share this:
    దేశంలో కరోనా మహమ్మరి విజృంభణ ఆగడం లేదు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఈ వైరస్ బారిన పడతున్నారు. తాజాగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కరోనా బారిన పడ్డారు. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హాస్పటల్ లో ఆయన చేరి చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన టీటీడీ సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. దీంతో ఆయనను కలిసిన వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నెల 12న వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ జన్మదినం జరిగింది. ఆ వేడుకల్లోనూ ఆయన పాల్గొని తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. వైవీ సుబ్బారెడ్డికి కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో ఆయన తల్లి ఆరోగ్యంపై సైతం ఆందోళన వ్యక్తమవుతోంది.

    ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు ఇంకా కరోనా తగ్గలేదు. దీంతో ఆయనను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. సెప్టెంబర్ 28వ తేదీన వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఆయన చికిత్స పొందుతున్నారు. కానీ, 14 రోజులు గడిచిన తర్వాత కూడా వెల్లంపల్లికి ఇంకా కరోనా తగ్గలేదు. దీంతో బుధవారం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఆయన కరోనా నుంచి కోలుకోకపోవడంతో పార్టీ నేతలు, కుటుంబ సభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

    ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు గతంతో పోలిస్తే తగ్గుముఖం పట్టాయి. తాజాగా ఏపీలో 3892 కోవిడ్ 19 కేసులు నమోదైనట్లు ప్రభుత్వం నిన్న విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 767465కి చేరింది. ఇక రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 32 మంది కరోనాతో చనిపోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 6319కి పెరిగింది. నిన్న విడుదల చేసిన హెల్త్ బులిటెన్ వివరాల ప్రకారం.. రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 607 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత పశ్చిమగోదావరి 518, కృష్ణా 458, చిత్తూరు 405, గుంటూరు 345, కడప 332, అనంతపురం 290, నెల్లూరు 219, విశాఖపట్నం 163, శ్రీకాకుళం 154, విజయనగరం 151, ప్రకాశం 146, కర్నూలు 104 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో చిత్తూరు జిల్లాలో 4, కృష్ణా 4, విశాఖపట్నం 4, తూర్పుగోదావరి 3, గుంటూరు 3, ప్రకాశం 3, అనంపురం 2, శ్రీకాకుళం 2, కర్నూలు 1, విజయనగరం 1, పశ్చిమగోదావరిలో ఒకరు కరోనాతో మరణించారు. ఏపీలో 24 గంటల్లో 5050 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 719477 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం రాష్ట్రంలో 41669 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో ఒక్కరోజులో 69,463 కరోనా టెస్టులు నిర్వహించారు. ఇప్పటి వరకు 67,72,273 కరోనా శాంపిల్స్ ను పరీక్షించారు.
    Published by:Nikhil Kumar S
    First published: