Home /News /coronavirus-latest-news /

TTD APPEALS TO THE DEVOTEES WHO TRAVELED ABROAD TO AVOID TIRUMALA PILGRIMAGE SK

వారు తిరుమలకు రావొద్దు.. కరోనా భయంతో టీటీడీ ప్రత్యేక విజ్ఞప్తి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భక్తుల ఆరోగ్య సంరక్షణను దృష్టిలో ఉంచుకుని.. విదేశాల నుండి వచ్చే భక్తుల విషయంలో జాగ్రత్తలు పాటిస్తున్నట్లు టీటీడీ తెలిపింది.

    దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కూడా పలు జాగ్రత్తలు పాటిస్తోంది. ఈ క్రమంలోనే భక్తులకు కీలక సూచనలు చేసింది. విదేశీయులు గానీ, విదేశాల్లో పర్యటించిన భారతీయులు గానీ.. భారత్‌లో అడుగు పెట్టిన 28 రోజుల వరకు తిరుమల సందర్శనకు రావొద్దని విజ్ఞప్తి చేసింది. తిరుమలలో నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు ఉంటారని..కరోనా వైరస్ సులభంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని అభిప్రాయపడింది. కరోనా వైరస్ ఒకరి నుండి అనేక మందికి సులభంగా వ్యాప్తిచెందే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ క్రమంలో భక్తుల ఆరోగ్య సంరక్షణను దృష్టిలో ఉంచుకుని.. విదేశాల నుండి వచ్చే భక్తుల విషయంలో జాగ్రత్తలు పాటిస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది.

    అటు కేరళలో 12 పాజిటివ్ కేసులు నమోదవడంతో ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డ్ (టీడీబీ) కూడా అప్రమత్తమైంది. మార్చి 13న ఆలయం తెరచుకోనుందని.. ఐతే కోరనా వైరస్ నేపథ్యంలో శబరిమలకు ఎవరూ రావొద్దని భక్తులను కోరింది. భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొనే ఈ అడ్వైజరీ జారీచేస్తున్నామని తెలిపింది.

    కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటి వరకు 4,090 మంది చనిపోయారు. మరో లక్షా 16వేల మంది ఈ వైరస్ సోకడంతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా చైనాలో కరోనా మరణాలు సంభవించాయి. చైనాలో ఇప్పటి వరకు 3,136 మంది చనిపోయారు. చైనా తర్వాత ఇటలీ రెండో స్థానంలో ఉంది. ఇటలీలో 463 మంది మరణించారు. ఇరాన్‌లో 291, దక్షిణ కొరియా 54, అమెరికాలో 27, ఫ్రాన్స్‌లో 30, స్పెయిన్లో 31, జపాన్‌లో 10, యూకే 5, నెదర్లాండ్స్ 4, ఆస్ట్రేలియా 3, హాంగ్‌కాంగ్ 3, స్విట్జర్లాండ్‌లో ఇద్దరు చనిపోయారు. ఇరాన్‌లో ఇవాళ ఒక్క రోజే 54 మంది చనిపోయారంటే. అక్కడ వ్యాధి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Coronavirus, Tirumala news, Tirumala tirupati devasthanam, Tirupati, Ttd

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు