కరోనా దానంతట అదే పోతుంది...ట్రంప్ వింత వ్యాఖ్యలు...

కరోనా మహమ్మారి దానంతట అదే పోతుందని అమెరికా ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము వ్యాక్సిన్ పై ఆధారపడడం లేదని, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు.

news18-telugu
Updated: May 2, 2020, 8:39 AM IST
కరోనా దానంతట అదే పోతుంది...ట్రంప్ వింత వ్యాఖ్యలు...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(ఫైల్ ఫోటో)
  • Share this:
కరోనా మహమ్మారి దానంతట అదే పోతుందని అమెరికా ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము వ్యాక్సిన్ పై ఆధారపడడం లేదని, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. వ్యాక్సిన్ ఉన్నా లేకున్నా ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయాలనుకుంటున్నట్లు ట్రంప్ తెలిపారు. అయితే ప్రజలు ఒపికగా ఉండాలని ఆయన సూచించారు. వైరస్ దానంతట అదే పోతుందని, త్వరలోనే నశించిపోతుందని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే ఆయన ప్రస్తుతం అమెరికా లో అద్యక్ష ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. ట్రంప్ ఒహాయో రాష్ట్రంలోనూ త్వరలో పర్యటించి, ఎన్నికల ప్రచారాన్ని ప్రారంబిస్తానని ప్రకటించారు. అందుకోసం భారీ సభలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సుమారు 25వేల మందితో సభలు నిర్వహిస్తామని వెల్లడించారు.

అమెరికాలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. ఏకంగా 60 వేల మందికి పైగానే చనిపోయారు. వియత్నాం యుద్ధంలో 58 వేల 200 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోతే, ఇప్పుడు ఏకంగా ఆ సంఖ్యను కరోనా దాటేసింది. మొత్తం బాధితుల సంఖ్య 10.64 లక్షలు దాటింది. ఒక్క రోజులోనే 2 వేలకు మందికి పైగా చనిపోతున్నారు. మరణించిన వారి మృతదేహాలను ఖననం చేసేందుకు కూడా స్థలం కూడా దొరకని పరిస్థితి నెలకొంటోంది.

 
First published: May 2, 2020, 8:39 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading