Hydroxychloroquine | ప్రధాని మోదీ సహాయం కోరిన ట్రంప్..

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ Hydroxychloroquine మందును దిగుమతి చేసుకోవాలని తలిచారు. వెంటనే ప్రధాని మోదీకి ఫోన్ చేసి.. మీరు బ్యాన్ చేసిన హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందును అమెరికాకు ఇవ్వండి అంటూ విజ్ఞప్తి చేశారు.

news18-telugu
Updated: April 6, 2020, 6:46 AM IST
Hydroxychloroquine | ప్రధాని మోదీ సహాయం కోరిన ట్రంప్..
ట్రంప్, మోదీ
  • Share this:
హైడ్రాక్సీ క్లోరోక్విన్.. ఈ మలేరియా మందు కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) తెలిపిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలీగానే ప్రజలు పెద్ద ఎత్తున మెడికల్ షాపులకు దారి పట్టి.. భారీగా కొనుగోలు చేశారు. అయితే, ఎంత మోతాదులో తీసుకోవాలో తెలీక కొందరు చనిపోయారు. దీంతో భారత ప్రభుత్వం దాన్ని బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మన దేశం బ్యాన్ చేసిందిగా.. ఆ విషయం తెలుసుకున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆ మందును దిగుమతి చేసుకోవాలని తలిచారు. వెంటనే ప్రధాని మోదీకి ఫోన్ చేసి.. మీరు బ్యాన్ చేసిన హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందును అమెరికాకు ఇవ్వండి అంటూ విజ్ఞప్తి చేశారు. ఇదే విషయాన్ని ట్రంపే స్వయంగా వెల్లడించారు.

కాగా, ట్రంప్ దృష్టిలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ గేమ్ ఛేంజర్ లాంటిది. భారత్‌లో ఆ మందు కరోనాపై ప్రభావవంతంగా పోరాడుతుండటంతో ట్రంప్ దాన్ని దిగుమతి చేసుకోవాలని భావించారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీకే స్వయంగా ఫోన్ చేసి ఆ మందును తమకు ఇవ్వాలని కోరారు. అయితే, ప్రస్తుతం ఎగుమతిపై, భారత్‌లో అమ్మకాలపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం అమెరికా అభ్యర్థనపై ఏ విధంగా స్పందిస్తుందనేది తెలియాల్సి ఉంది.
Published by: Shravan Kumar Bommakanti
First published: April 6, 2020, 6:46 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading