కరోనా టీకా ఈ సంవత్సం చివరి నాటికి సిద్ధం...ట్రంప్..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(ఫైల్ ఫోటో)

సంవత్సరం చివరినాటికి టీకా చేయబోతున్నామని ట్రంప్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలు ప్రారంభించామని, గిల్బర్ట్ పరీక్షలు చేస్తున్నారని ట్రంప్ వెల్లడించారు.

  • Share this:
    కరోనాతో అమెరికా అతలాకుతలం అవుతోంది. అయితే తాజా పరిస్థితులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంవత్సరం చివరినాటికి టీకా చేయబోతున్నామని ట్రంప్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంతేకాదు దేశీయ ప్రయాణ సేవలను కూడా మొదలుపెట్టనున్నట్టు ట్రంప్ ప్రభుత్వం వెల్లడించింది. మరోపక్క అమెరికాలో దాదాపు 50 శాతం ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేయనుంది. అంతేకాదు అమెరికాలో కరోనాతో 80 వేల నుంచి లక్ష మంది వరకు చనిపోతారని ఆయన అంచనా వేశారు. అయితే కొన్నిరోజుల కిందట ఆయన అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 70 వేల వరకు చేరుకునే అవకాశముందని అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం మరణాల సంఖ్య 68 వేలు దాటడంతో ఆయన మాట మార్చారు. ఇదిలా ఉంటే మే 4వ తేదీ వరకు అమెరికా వ్యాప్తంగా 11 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా.. 68,598 మంది కరోనా కారణంగా మృతిచెందారు. ఇదిలా ఉంటే వాషింగ్టన్ డిసిలోని లింకన్ మెమోరియల్ నుండి ప్రసారం చేసిన ఫాక్స్ న్యూస్ టౌన్ హాల్ షోలో ట్రంప్ మాట్లాడుతున్నారు.

    సంవత్సరం చివరినాటికి టీకా చేయబోతున్నామని ట్రంప్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలు ప్రారంభించామని, గిల్బర్ట్ పరీక్షలు చేస్తున్నారని ట్రంప్ వెల్లడించారు.
    Published by:Krishna Adithya
    First published: