అమెరికాలో కరోనా వైరస్ మరణ మృందంగం మోగిస్తోంది. కొత్త కేసుల సంఖ్య, మరణాలు తగ్గుముఖం పట్టినప్పటికీ.. కోవిడ్ విజృంభణ మాత్రం కొనసాగుతోంది. అమెరికాలో కరోనా బారినపడి చనిపోయిన వారి సంఖ్య లక్ష దాటింది. తాజా లెక్కల ప్రకారం.. అమెరికాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,749,722కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 102,249 మంది చనిపోయారు. మరో 490,262 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం అమెరికాలో 1,157,211 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 17,227 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు worldometers.info గణాంకాలు చెబుతున్నాయి.
అమెరికాలో కరోనా మరణాలు లక్ష మైల్ స్టోన్ దాటాయని అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
We have just reached a very sad milestone with the coronavirus pandemic deaths reaching 100,000. To all of the families & friends of those who have passed, I want to extend my heartfelt sympathy & love for everything that these great people stood for & represent. God be with you!
— Donald J. Trump (@realDonaldTrump) May 28, 2020
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, Donald trump, USA