Donald Trump Covid update: ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన ట్రంప్.. అందరికీ షాక్!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం క్షీణించిందంటూ పలు కథనాలు వస్తున్న ఈ సమయంలో ఆయన ఆస్పత్రి నుంచి బయటకు వచ్చి అందరికీ షాక్ ఇచ్చారు. తాను బాగానే ఉన్నానన్న సంకేతాలు ఇచ్చి మళ్లీ లోపలకు వెళ్లిపోయారు.

news18-telugu
Updated: October 5, 2020, 11:03 AM IST
Donald Trump Covid update: ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన ట్రంప్.. అందరికీ షాక్!
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. అయితే రెండు రోజులుగా ఆయన ఆరోగ్యంపై పలు కథనాలు వచ్చాయి. ట్రంప్ ఆరోగ్యం క్షీణించిందన్న వార్తలు గుప్పుమనడంతో ఆయన మద్దతుదారులు, అభిమానుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఈ సమయంలో ట్రంప్ తన చర్యలతో మరో సారి విమర్శలపాలయ్యారు. కరోనా నిబంధనలకు విరుద్ధంగా ఆయన ఆస్పత్రి నుంచి బయటకు వచ్చి అందరికీ షాకిచ్చారు. బులెట్ ప్రూఫ్ కారులో రోడ్డుపై కాసేపు తిరిగారు. కారులో నుంచే తన మద్దతుదారులు, అభిమానులకు అభివాదం చేశారు. ఆ సమయంలో ఆయన మాస్క్ ధరించి కనిపించారు. తాను బాగానే ఉన్నానన్న సంకేతాలను తన సైగల ద్వారా ఆయన అభిమానులకు ఇచ్చారు. అనంతరం ఆయన తిరిగి ఆస్పత్రిలోకి వెళ్లిపోయారు.

కరోనా సోకిన ట్రంప్ నెగటీవ్ రాకుండానే ఇలా బయటకు రావడంతో వివిధ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన నుంచి ఇతరులకు వైరస్ వ్యాపించకుండా.. ఐసోలేషన్ లో ఉండి అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన అధ్యక్షుడు ఇలా బయటకు రావడంపై పలువురు మండిపడుతున్నారు. ఆస్పత్రి నుంచి బయటకు రావడానికి ముందు ట్రంప్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్టు చేశారు. కరోనా గురించి తాను చాలా తెలుసుకున్నానన్నారు. ఇందు కోసం స్కూలుకు వెళ్లినట్లుగా ఉందని చెప్పారు. తన కోసం ఎదురుచూస్తున్న అభిమానులను ఆశ్చర్యం కలిగించబోతున్నానని చెప్పి సంకేతం ఇచ్చిన ట్రంప్.. ఆ మేరకు బయటకు వచ్చి అభివాదం చేసి వెళ్లిపోయారు.

ఇలాంటి చర్యల ద్వారా ఆయన సీక్రెట్ సర్వీస్ ఏజంట్లు, సెక్యూరిటీలోని ఎవరికైనా ట్రంప్ నుంచి వైరస్ సోకితే ఎవరిది బాధ్యత అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అయితే వైట్ హౌస్ అధికార ప్రతినిధి జూడ్ డీర్ ఈ అంశంపై స్పందించారు. ట్రంప్ బయటకురావడంపై వస్తున్న విమర్శలను ఖండించారు. ట్రంప్ తో పాటు ఉన్న వారంతా ప్రొటెక్టివ్ గేర్ ను ధరించారని తెలిపారు. డాక్టర్ల బృందం సురక్షితమని చెప్పిన తర్వాతనే ట్రంప్ బయటకు వచ్చారని స్పష్టం చేశారు.

కరోనా వచ్చిన 17 గంటల తర్వాత ట్రంప్ పూర్తిగా వైద్యుల సమక్షంలోకి వెళ్లి చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారని వార్తలు వచ్చాయి. సీఎన్ఎన్ రిపోర్టు ప్రకారం.. ట్రంప్ సలహాదారులలో ఒకరిగా ఉన్న ఒక వ్యక్తి ఈ విషయాన్ని ధృవీకరించారు. అధ్యక్షుడి ఆరోగ్యం గురించి ఆందోళన చెందడానికి కారణాలున్నాయని ఆయన చెప్పడం గమనార్హం. ట్రంప్ చాలా అలసటతో, శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడని సీఎన్ఎన్ కథనాన్ని ప్రచారం చేసింది.


కాగా.. కొద్ది రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆయనకు కరోనా రావడం ఆయన మద్దతుదారుల్లో ఆందోళనను పెంచుతోంది. బుధవారం ఆయన సలహాదారుడు హోప్ హిక్స్ కు కరోనా వచ్చిన వెంటనే అప్రమత్తమైన వైట్ హౌస్ సిబ్బంది.. ట్రంప్ తో పాటు ఆయన భార్యకు పరీక్షలు నిర్వహించగా.. వారిరువురికి పాజిటివ్ గా తేలింది. దీంతో వారిరువురు క్వారంటైన్ కు వెళ్లిన విషయం తెలిసిందే.
Published by: Nikhil Kumar S
First published: October 5, 2020, 10:40 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading