కరోనా పీడ పోవాలి... టీఆర్ఎస్ ఎమ్మెల్యే హోమం...

కరోనా వైరస్ నాశనం అయిపోవాలంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ హోమం నిర్వహిస్తున్నారు.

news18-telugu
Updated: April 8, 2020, 3:14 PM IST
కరోనా పీడ పోవాలి... టీఆర్ఎస్ ఎమ్మెల్యే హోమం...
తిరుమలలో ధన్వంతరి యాగం నిర్వహించినప్పటి ఫొటో
  • Share this:
కరోనా వైరస్ నాశనం అయిపోవాలంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ హోమం నిర్వహిస్తున్నారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఈ మేరకు హోమం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అయ్యప్పస్వామి దేవాలయంలో శంకర్ నాయక్ దంపతులు కరోనా నివారణ హోమం, అభిషేకాలు చేస్తున్నారు. వేద పండితులు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. కరోనా మహమ్మారి బెడద పోవాలని, దేశం సమూలంగా కరోనా నుంచి విముక్తి కావాలంటూ వేదపండితులు హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సత్యవతి రాథోడ్ హాజరయ్యారు. ఇటీవల తిరుమలలో కూడా కరోనా నివారణ కోసం ధన్వంతరి మహాయాగం నిర్వహించారు. భయంగానీ, ఉపద్రవాలు గానీ, ప్రకృతి వైపరీత్యాలు గానీ, మహావ్యాధులు గానీ ప్రబలినప్పుడు శ్రీవారికి శాంతి ఉత్సవాలు చేపడతారు. మూడు రోజుల పాటు ఈ యాగాన్ని నిర్వహించారు. శ్రీనివాసమూర్తిని, ధన్వంతరి మూర్తికి యాగం చేసి పూర్ణాహుతి చేపట్టారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: April 8, 2020, 3:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading