గులాబీ బాస్ వార్నింగ్... రోడ్లపైకి వస్తున్న నేతలు

కేసీఆర్ ఇచ్చిన వార్నింగ్‌తో టీఆర్ఎస్ నేతలు వెంటనే అప్రమత్తమయ్యారు.

news18-telugu
Updated: March 27, 2020, 8:28 PM IST
గులాబీ బాస్ వార్నింగ్... రోడ్లపైకి వస్తున్న నేతలు
కేసీఆర్, తెలంగాణ సీఎం
  • Share this:
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చిన వార్నింగ్ పార్టీ నేతలపై బాగా పని చేసిందా ? కొద్ది రోజుల క్రితం వరకు ఇంటి నుంచి అడుగు బయటపెట్టిన చాలామంది నేతలు... కేసీఆర్ ఇచ్చిన వార్నింగ్‌తో కరోనాపై యుద్ధానికి బయలుదేరారా ? చాలామంది ప్రజాప్రతినిధుల తీరు చూస్తే అవుననే అనిపిస్తోంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని పిలుపునిచ్చిన సీఎం కేసీఆర్... ఈ విషయంలో వారిని నియంత్రిస్తున్న ప్రభుత్వ అధికారులు, పోలీసులను అభినందించారు. ఇదే సమయంలో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులంతా ఈ సమయంలో ఏమయ్యారని కాస్త గట్టిగానే నిలదీశారు.

ఇలాంటి క్లిష్ట సమయంలో పని చేస్తారనే ఉద్దేశ్యంతోనే ప్రజలు నాయకులను ఎన్నుకుంటారని వారికి క్లాస్ తీసుకున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు అంతా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రంగంలోకి దిగాలని సీఎం కేసీఆర్ పరోక్షంగా ఆదేశాలు జారీ చేశారు. గులాబీ బాస్ ఈ రేంజ్‌లో ఫైర్ కావడంతో... టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అంతా ఇప్పుడు ఎక్కువగా రోడ్ల మీదే కనిపిస్తున్నారు.

రోడ్లపైకి వస్తున్న ప్రజలకు లాక్ డౌన్ గురించి అవగాహన కల్పిస్తున్నారు. కూరగాయల ధరలు ఎలా ఉన్నాయి... నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయనే దానిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పలువురు మంత్రులు జిల్లా స్థాయిలో కలెక్టర్లలో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రజలకు అందుతున్న సదుపాయాల గురించి వారినే స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. మొత్తానికి సీఎం కేసీఆర్ ఇచ్చిన వార్నింగ్ టీఆర్ఎస్ నేతల్లో బాగానే టెన్షన్ పెంచినట్టు కనిపిస్తోంది.First published: March 27, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading