డ్రైవర్‌కు కరోనా.. హోం క్వారంటైన్‌లోకి మాజీ ఎంపీ కవిత

కవిత(ఫైల్ ఫోటో)

తన డ్రైవర్‌కు కరోనా పాజిటివ్ రావడంతో టీఆర్ఎస్ మాజీ ఎంపీ కవిత హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు.

 • Share this:
  తమ దగ్గర పని చేసే సిబ్బందికి కరోనా వస్తే వెంటనే హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోతున్నారు ప్రముఖులు. తాజాగా టీఆర్ఎస్ మాజీ ఎంపీ, కేసీఆర్ కుమార్తె కవిత కూడా ఇదే రకంగా హోం క్వారంటైన్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆమె దగ్గర పని చేస్తున్న కారు డ్రైవర్‌కు కొద్దిసేపటి క్రితం కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో కవిత, ఆమె కుటుంబసభ్యులు హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో కవిత ఉంటున్నారు. ఇదిలా ఉంటే అంతకు కొద్దిసేపటి ముందే కవిత మంత్రి కేటీఆర్ బర్త్ డే సందర్భంగా రూపొందించిన ఓ పాటను ఆవిష్కరించారు.

  ప్రగతి భవనలో జరిగిన ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన భార్య శ్రీదేవితో పాటు పలువురు పాల్గొన్నారు. ఆ వెంటనే తన డ్రైవర్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో కవిత హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు.

  ఇదిలా ఉంటే తెలంగాణలో కొత్తగా 1,567 మందికి కరోనా సోకింది. కరోనా కారణంగా గురువారం తొమ్మిది మృతి చెందారు. ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 50,826కి చేరుకుంది. ఇప్పటివరకూ కోలుకుని 39,327 మంది డిశ్చార్జు అయ్యారు. తాజాగా 1,661 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,052 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.
  Published by:Kishore Akkaladevi
  First published: