హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

చేపలతో వున్న ఆటో ను ఢీ కొన్న టిప్పర్...

చేపలతో వున్న ఆటో ను ఢీ కొన్న టిప్పర్...

కర్ఫ్యూ ఉన్న సమయం లో ఈ మట్టి టిప్పర్ లకు ఎలా అనుమతిని ఇచ్చారు

కర్ఫ్యూ ఉన్న సమయం లో ఈ మట్టి టిప్పర్ లకు ఎలా అనుమతిని ఇచ్చారు

మెదక్ జిల్లా నర్సాపూర్ లోని అటవీ ప్రాంతంలో ఆగి ఉన్న చేపల ఆటో ను హైదరాబాద్ నుండి వస్తున్న మట్టి టిప్పర్ డీ కొట్టడం తో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

మెదక్ జిల్లా నర్సాపూర్ లోని అటవీ ప్రాంతంలో ఆగి ఉన్న చేపల ఆటో ను హైదరాబాద్ నుండి వస్తున్న మట్టి టిప్పర్ డీ కొట్టడం తో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఐదుగురికి తీవ్ర గాయాలు కావటంతో 108 లో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో నర్సాపూర్ కి చెందిన గూని శ్రీహరి 34 సంవత్సరాలు. రుస్తుంపేట్ కి చెందిన బోయి నర్సింగరావు 24 సంవత్సరాలు . మృతి చెందిన వారి బంధువులు మరియు ఊరి వాళ్ళు కలిసి రాస్తారోకో చేశారు. ఈ సంధర్భంగా వాళ్ళు మాట్లాడుతూ నర్సాపూర్ నుండి అక్రమంగా తరలిస్తున్న మట్టి వెనకాల చాలా మంది పెద్ద రాజకీయ నాయకులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు ఉన్నారని ఆరోపించారు. ఇలా అక్రమంగా తరలించే క్రమంలో మట్టి టిప్పర్ వల్ల ఈ విధంగా ఇంకా ఎన్నో ప్రాణాలను కోల్పోవాల్సివస్తుందని ఆరోపించారు. ఇప్పుడు ఉన్న లాక్ డౌన్ లో సాయంత్రం 7 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉన్న సమయం లో ఈ మట్టి టిప్పర్ లకు ఎలా అనుమతిని ఇచ్చారు అని ఆరోపించారు. కాసులకు కక్కుర్తి పడి రెండు నిండు ప్రాణాలు పోవటానికి కారణమయిని వారికి శిక్ష విధించాలని కోరారు. రాస్తా రోకో చేసిన వారిని నర్సాపూర్ పోలీసులు చెదరగొట్టారు.

First published:

Tags: Accident, Lockdown, Medak, Telangana

ఉత్తమ కథలు