నిజామాబాద్ జిల్లాః కరోనా మహమ్మారి కారణంగా యాభై ఎనిమిది రోజుల తర్వాత ఆర్టీసీ బస్సు చక్రాలు కదిలాయి.. ఉదయం 6గంటల నుంచి బస్సులు డిపో నుంచి బయలుదేరుతాయి..తిరిగి సాయంత్రం 7గంటలకు డిపోలకు చేరుకునేలా ప్రణాళిక సిద్ధం చేసారు అధికారులు..
ప్రస్తుతం నిజామాబాద్ నుండి బయలు దేరిన బస్సుల్లో ప్రయాణికులు పరిమితంగా ఉన్నారు.. ప్రజలకు బస్సులు రోడ్డేక్కిన విషయం తెలియక బస్సులు అన్ని కాళీగా వెలుతున్నాయి.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆరు డిపోల్లో 678 బస్సులుండగా 2,800 మంది సిబ్బంది పనిచేస్తున్నారు.. ప్రతి డిపో నుంచి యాభై శాతానికి మించి బస్సులు నడపొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రద్దీ ఆధారంగా కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ ఆదిలాబాద్ వంటి దూర ప్రాంతాల సర్వీసులను నడుపుతున్నామన్నారు.. అన్ని గ్రామాలకు ఒకేసారి కాకుండా ప్రయాణికుల రద్దీ ఎక్కువగ వుండే ప్రాంతాలను గుర్తించి అక్కడికి మాత్రమే నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని స్టేషన్ మేనేజర్ తెలిపారు..
ప్రయాణికులు ఇష్టం వచ్చినట్లు కూర్చోవడానికి వీల్లేదు ముగ్గురు కూర్చిన సీట్లో ఇద్దరు, ఇద్దరు కూర్చునే సీట్లో ఒక్కరు కూర్చుకునే విదంగా ఏర్పాట్లు చేసామని తెలిపారు.. మాస్కులు లేకుండా అనుమతించేది లేదని తెలిపారు..
ఉదయం ఆరు నుంచి బస్సులు డిపో నుంచి బయలుదేరుతాయి తిరిగి సాయంత్రం ఏడు గంటలకు డిపోలకు చేరుకునేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.
Published by:Venu Gopal
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.