Home /News /coronavirus-latest-news /

TRAVEL GOOD NEWS FOR INTERNATIONAL TRAVELERS CORONA LIFTING OF SANCTIONS EVK

Travel: ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు అమ‌లు

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

Corona Restrictions | కరోనా వైరస్‌ సంబంధించిన కొత్త వేరియంట్ ఓమిక్రాన్ (Omicran) ముప్పును దృష్టిలో ఉంచుకుని కేంద్రం అంతర్జాతీయ ప్రయాణీకుల విషయంలో కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇన్ని రోజులు ఈ క‌ఠిన ఆంక్ష‌ల‌ను ప్ర‌న‌భుత్వం అమ‌లు చేసింది. తాజాగా ఆ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను స‌డ‌లించారు.

ఇంకా చదవండి ...
    కరోనా వైరస్‌ (Corona Virus) కు సంబంధించిన కొత్త వేరియంట్ ఓమిక్రాన్ (Omicron) ముప్పును దృష్టిలో ఉంచుకుని కేంద్రం అంతర్జాతీయ ప్రయాణీకుల విషయంలో కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇన్ని రోజులు ఈ క‌ఠిన ఆంక్ష‌ల‌ను ప్ర‌న‌భుత్వం అమ‌లు చేసింది. కొద్ది రోజుల పాటు సింగపూర్‌ (Singapoor) దేశం నుంచి ఇండియా వచ్చే ప్రయాణికులు ఎయిర్‌పోర్టులలో కోవిడ్‌ నిర్థారణ కోసం ఆర్టీపీసీఆర్‌ పరీక్ష కోసం ఎదురు చూడ‌కుండా నో రిస్క్ కంట్రీగా ఉంచారు. అనంత‌రం కేసులు తీవ్ర‌త‌తో వారంద‌రికీ క్వారంటైన్ క‌చ్చితం అని తెలిపారు. ప్రపంచ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ విషయంలో మార్గదర్శకాలను జారీ చేసిందని, విమానాశ్రయాలు (Airports) మరియు ఓడరేవుల వద్ద గట్టి నిఘా కొనసాగిస్తున్నట్లు ప్ర‌భుత్వం తెలిపింది.

    Health Tips: క‌రోనా వేళ‌.. పిలల్ల‌కు రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచే ఆయుర్వేద చిట్కాలు!

    అయితే తాజాగా భారతదేశానికి వచ్చే అంతర్జాతీయ (International) ప్రయాణీకులకు శుభవార్త ఏమిటంటే, వారు COVID-19 కోసం పాజిటివ్ పరీక్షించినట్లయితే, వారు శనివారం నుండి ఐసోలేషన్ సదుపాయంలో ఉండడం తప్పనిసరి కాదు, అయితే ప్రోటోకాల్‌ల ప్రకారం ఇంట్లో తమను తాము ఐసోలేష‌న్‌ (Isolation) లో ఉంఉకోవాల‌నిఅధికారులు సూచించారు. గురువారం విడుదల చేసిన మార్గ‌ద‌ర్శకాను ప్ర‌భుత్వం స‌వ‌రించింది. 'అంతర్జాతీయ రాకపోకల మార్గదర్శకాల ప్ర‌కారం కోవిడ్‌ పరీక్షలు చేసిన విదేశీయులు, నెగెటివ్ పరీక్షించిన తర్వాత కూడా ఏడు రోజుల పాటు హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని.. ఎనిమిదో తేదీన RT-PCR పరీక్షను చేపట్టాలని ప్రభుత్వం తెలిపింది.

    Corona Cases: జైల్‌లో క‌రోనా క‌ల‌క‌లం.. 262 మంది ఖైదీల‌కు పాజిటీవ్‌

    అయితే శ‌నివారం నుంచి సవరించిన మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి. అంతకు ముందు ప్ర‌కారం ఏమిటంటే, 'ప్రమాదంలో' పరిగణించబడే వారితో సహా ఏదైనా దేశం నుంచి వచ్చే ప్రయాణికులను ఐసోలేషన్ సదుపాయంలో నిర్వహించి, ప్రామాణిక ప్రోటోకాల్‌ల ప్రకారం చికిత్స చేస్తారని ప్రభుత్వం తెలిపింది. తాజా మార్గదర్శకాలలో, వచ్చిన తర్వాత 'ఐసోలేషన్ సౌకర్యం'లో ఉండాలనే నిబంధన తొలగించారు. స్క్రీనింగ్ సమయంలో రోగలక్షణాలు ఉన్నట్లు గుర్తించిన ప్రయాణికులను వెంటనే ఐసోలేట్ చేసి వైద్య సదుపాయానికి తీసుకువెళతామని ప్రభుత్వం తెలిపింది. పాజిటివ్ అని తేలితే, వారి పరిచయాలను గుర్తించి, నిబంధనల ప్రకారం నిర్వహిస్తారు.

    దేశంలో ఒమిక్రాన్ (Omicron) కేసులు పెరుగుతున్న ప్ర‌భుత్వం వ్యాక్సినేష‌న్ వేగ‌వంతం చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. టీనేజ‌ర్ల‌కు వ్యాక్సినేష‌న్ వేగ‌వంతం చేస్తోంది. ఈ నేప‌థ్యంలో CoWIN పోర్టల్ రిజిస్ట్రేష‌న్ ప్రాసెస్‌లో ప‌లు మార్పులు చేశారు. కోవిన్ రిజిస్ట్రేష‌న్ మొబైల్ నంబ‌ర్ త‌ప్ప‌నిస‌రి. ఇప్ప‌టిదాకా మొబైల్ నంబ‌ర్ (Mobile Number) ద్వారా 4 మాత్ర‌మే రిజిస్ట్రేష‌న్ చేసుకొనే అవ‌కాశం ఉంది. అయితే ఇక‌మీద 6 గురికి అవ‌కాశం క‌ల్పించేలా రిజిస్ట్రేష‌న్ ప్రాసెస్‌ (Registration Process) లో మార్పులు చేశారు. ఈ విష‌యాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Corona, Corona virus, Omicron, Omicron corona variant, Travel

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు