వలస కార్మికుల ఖాతాల్లోకి రూ.10వేలు.. బెంగాల్ సీఎం డిమాండ్

ఆత్మ నిర్భర్ ప్యాకేజీల వల్ల వారికేమీ ఒరగదని.. నేరుగా డబ్బులు ఇస్తేనే కొంత ఇబ్బందులు తొలగుతాయని ఆమె చెప్పారు.

news18-telugu
Updated: June 3, 2020, 2:21 PM IST
వలస కార్మికుల ఖాతాల్లోకి రూ.10వేలు.. బెంగాల్ సీఎం డిమాండ్
మమతా బెనర్జీ
  • Share this:
కరోనా లాక్‌డౌన్ ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ముఖ్యంగా వలస కార్మికుల కష్టాలు వర్ణనాతీతమని చెప్పారు. ఈ నేపథ్యంలో పీఎం కేర్స్ నిధుల నుంచి వలస కార్మికులందరి ఖాతాల్లో రూ.10వేలు జమచేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు మమత. ఆత్మ నిర్భర్ ప్యాకేజీల వల్ల వారికేమీ ఒరగదని.. నేరుగా డబ్బులు ఇస్తేనే కొంత ఇబ్బందులు తొలగుతాయని చెప్పారు. అసంఘటిత రంగంలోకి కార్మికులను కూడా ఆర్థికంగా ఆదుకోవాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు.


ఇప్పటికే కరోనా కష్టాల్లో ఉన్న పశ్చిమ బెంగాల్ అంఫన్ తుఫాన్‌తో మరింత నష్టపోయిందని మంగళవారం మమతా బెనర్జీ పేర్కొన్నారు. తుఫాన్ బాధితుల పునరావాసం కోసం బెంగాల్ ప్రభుత్వం ఇప్పటికే రూ.1444 కోట్లను విడుదల చేసిందని చెప్పారు. సుమారు 5 లక్షల మందికి ఇళ్ల మరమ్మత్తుల కోసం ఆర్థిక సాయం చేశామని.. పంట నష్టపోయిన 23.3 లక్షల మంది రైతులకు ఆర్థిక సాయం చేసినట్లు వెల్లడించారు. కాగా, మే 20న అంఫన్ తుఫాన్ పశ్చిమ బెంగాల్‌లో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. తుఫాన్ ధాటికి అక్కడ 97 మంది మరణించారు.

First published: June 3, 2020, 2:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading