నెల రోజులకు పైగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులకు కేంద్రం గుడ్న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. వలస కార్మికులతో పాటు పర్యాటకులు, యాత్రికులు, విద్యార్థులు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు అనుమతిచ్చింది. దీనిపై మార్గదర్శకాలను విడుదల చేసి.. అన్ని రాష్ట్రాలకు లేఖలను కూడా రాసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆ ఏర్పాట్లలో ఉన్నాయి. ఐతే వారిని ఎలా తరలించాలన్న దానిపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు.. రోజుల తరబడి బస్సుల్లో ఎళ్లా వెళ్తారని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటున్నారు. మండుటెండల్లో బస్సులో ప్రయాణించడం శ్రేయస్కరం కాదని అభిప్రాయపడ్డారు. వలస కార్మికులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం రైళ్లను నడపాలని..వారిని ఉచితంగా గమ్యస్థానాలకు సూచించారు తలసాని.
Over 2 crore people are stranded in different States amid #lockdown. Central govt's guidelines (on their movement) are not appropriate. How can people travel 3 to 4 days in buses in this heat? Train is better mode of transport than bus: Telangana Minister Talasani Srinivas Yadav pic.twitter.com/VaEominWw0
— ANI (@ANI) April 30, 2020
వలస కార్మికులను తరలించేందుకు కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేయడంతో.. తెలంగాణ ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల రధాన కార్యదర్శులకు తెలంగాణ ప్రభుత్వ సీఎస్ సోమేష్ కుమార్ లేఖ రాశారు. తెలంగాణలో చిక్కుకుపోయిన తమ రాష్ట్రాలకు చెందిన వారి వివరాలను అందజేయాలని పేర్కొన్నారు. వారిని ఇక్కడి నుంచి తీసుకెళ్లేందుకు రవాణా ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏర్పాట్లు పూర్తైన వెంటనే దశల వారీగా వలస కార్మికులను తమన సొంతూళ్లకు తరలించనుంది తెలంగాణ ప్రభుత్వం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona, Corona virus, Coronavirus, Covid-19, Lockdown, Talasani Srinivas Yadav, Telangana